శనివారం 06 జూన్ 2020
Mulugu - May 14, 2020 , 02:45:28

మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు

మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల/ఆత్మకూరు, మే13: పంట పండించిన రైతు నష్టపోవద్దని ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మ కూరు మండలంలోని కామారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవా రం ఆయన ప్రారంభించారు. నడికూడ మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధు లతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌ నిర్మాణం కోసం స్థలాలను పరిశీలిం చారు. చల్లా చారిటబుల్‌ ట్రస్టుకు మారుతీ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఈగ మార్కండేయ రూ. లక్ష విరాళాన్ని ధర్మారెడ్డికి అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమలత, ఎంపీ పీ అనసూర్య, డీసీసీబీ డైరెక్టర్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


logo