గురువారం 09 జూలై 2020
Mulugu - May 10, 2020 , 02:39:37

పని చేసే వారిని ఆదరించాలి

పని చేసే వారిని ఆదరించాలి

  • చీఫ్‌విప్‌  దాస్యం వినయ్‌భాస్కర్‌

నయీంనగర్‌, మే 09 : ఇళ్లలో పని చేసే వారిని ఇంటి యజమానులు ఆదరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కోరారు.  హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నియోజకవర్గంలోని పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఇళ్లలో పనిచేసే వారికి యజమానులు నెలనెలా జీతాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన రజక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ చీఫ్‌విప్‌కు గోపాలపురం కాకతీయ లాండ్రీ అసోసియేషన్‌ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారిని ఆదుకుంటామని దాస్యం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుడా డైరెక్టర్‌ బొర్ర ఐలయ్య, నాయకులు సుందర్‌రాజు, రజినీకాంత్‌, రజక సంఘం నాయకులు భిక్షపతి, ఐలయ్య, సమ్మయ్య, శ్రీనివాస్‌, కిశోర్‌, కనకరాజు పాల్గొన్నారు.


logo