శనివారం 06 జూన్ 2020
Mulugu - May 07, 2020 , 02:22:35

వినూత్న పద్ధతిలో ధాన్యం తరలింపు

వినూత్న పద్ధతిలో  ధాన్యం తరలింపు

కలెక్టరేట్‌: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు జనగామ కలెక్టర్‌ నిఖిల వినూ త్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధికారులతో ఆమె బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రా మాల్లోని ప్రజాప్రతినిధులతో చ ర్చించి ట్రాక్టర్లు, గూడ్స్‌ రవాణాకు ఉపయోగకరంగా ఉన్న వాహనా ల్లో సెంటర్లలోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నీ బ్యా గుల కొరత  ఉండొద్దని, ఎఫ్‌పీ షాపుల గన్నీ బ్యాగులను వారి పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు పంపించేలా చూడాలన్నారు. ధా న్యాన్ని మిల్లులకు చేర్చిన వెంటనే తహసీల్దార్లు వారి పరిధిలోని ధరణి ఆపరేటర్లను తీసుకెళ్లి మిల్లర్‌ యాప్‌లో అక్నాలెడ్జ్‌మెంట్‌ రసీదును ఇప్పించే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు మధుమోహన్‌, రమేశ్‌, తహసీల్దార్లు, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీఎస్‌వో రోజారాణి,  అధికారులు రాంపతి, మద్దిలేటి పాల్గొన్నారు.


logo