సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - May 07, 2020 , 02:22:37

అందుబాటులో గన్నీ సంచులు

అందుబాటులో గన్నీ సంచులు

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 40వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 158 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు అవసరమైన 26 లక్షల గన్నీ సంచులకు 24లక్షల గన్నీ సంచులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మొదటి విడతగా పాత గన్నీ సంచులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు 2634 టార్ఫాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రభు త్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన వారికి మాత్రమే విక్రయాల టోకెన్లను జారీ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం సంబంధిత రైస్‌ మిల్లుకు చేరి ట్రక్‌సీట్‌ ఆన్‌లైన్‌ చేసిన వెంటనే రైతులకు నగదు వారి అకౌంట్‌లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం పంపే రైస్‌ మిల్లుల వద్ద దిగుమతి ఆలస్యం కాకుండా ఉండేందుకు హమాలీలను సంబంధిత వాహనాల్లోనే రైస్‌ మిల్లుల వద్దకు పంపించి దిగుమతి చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 


logo