శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Apr 24, 2020 , 01:11:12

పుస్తక పఠనం ఎంతో గొప్పది

పుస్తక పఠనం ఎంతో గొప్పది

  • చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

నయీంనగర్‌/కాజీపేట/రెడ్డికాలనీ/వరంగల్‌ క్రైం : పుస్తక పఠనం ఎంతో గొప్పదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో  గురువారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందన్నారు. అలాగే, కాజీపేటతోపాటు వేయిస్తంభాల ఆలయం వద్ద ఆటోడ్రైవర్లకు వినయ్‌భాస్కర్‌ నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ట్రైసిటీ ప్రైవేట్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కిషన్‌పురలో 120 మంది శానిటేషన్‌ సిబ్బందికి అన్నదానం చేసి, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అలాగే,  ఫాతిమానగర్‌ జంక్షన్‌లో ఏకశిల క్రియేటివ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిన్నెర రమేశ్‌ ఆధ్వర్యంలో గీసిన కరోనా వైరస్‌ చిత్రాన్ని దాస్యం వినయ్‌భాస్కర్‌ చూసి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్‌ కాంట్రాక్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌, ఉపాధ్యక్షుడు లింగారావు, శేషగిరిరావు, మహేందర్‌రెడ్డి,  కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్‌, శ్రీలేఖ, స్వాతిరెడ్డి, దేవేందర్‌, నాయకులు లారెన్స్‌, కృష్ణ, రజినీకాంత్‌, ఖలీల్‌, బాబురావు, వేణుగోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.   

తాజావార్తలు


logo