ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Apr 20, 2020 , 02:05:47

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

  • మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత

కురవి, ఏప్రిల్‌ 19: రైతాంగ సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీ మాలోత్‌ కవిత  అన్నారు. కురవి మండలం నేరడ, కురవి గ్రామాల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ఆమె ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. నిత్యం నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ బిడ్డగా పుట్టడం తన అదృష్టమని అన్నారు. మానుకోట జిల్లా గ్రీన్‌జోన్‌లోకి రావడానికి అన్ని శాఖల అధికారులు చేసిన కృషి అభినందనీయమని అ న్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మాట్లాడుతూ పంటకు సాగు నీరు.. పెట్టుబడికి సాయం.. ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా వంటి అత్యున్నత పథకాలను తీసుకువచ్చిన మహానాయకుడుగా సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి, కురవి సొసైటీ చైర్మన్‌ దొడ్డ గోవర్ధనరెడ్డి, బజ్జూరి పిచ్చిరెడ్డి, తోట లాలయ్య, ముండ్ల రమేశ్‌, రాజునాయక్‌, ఎర్ర నాగేశ్వర్‌రావు, నర్సింహారావు, వైస్‌ ఎంపీపీ దొంగలి నర్సయ్య, సర్పంచ్‌లు బొల్లోజు శ్రీనివాస్‌, అమ్రీబాయి, సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి, ఎంపీటీసీలు, ఎంపీడీవో ధన్‌సింగ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సొసైటీ నోడల్‌ అధికారులు అశోక్‌, శ్రీదేవి, నర్సింహారెడ్డి, ఉపేందర్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo