మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Apr 10, 2020 , 00:35:28

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ ముందుచూపు

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ ముందుచూపు

  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పర్వతగిరి, ఏప్రిల్‌ 09: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మేరు సంఘం అందించిన ఐదు వేల మాస్కులను గురువారం పర్వతగిరిలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్‌తో ప్రపంచమే స్తంభించిందని, ఆర్థిక లావాదేవీలతోపాటుగా ప్రజా జీవనం నిలిచిపోయిందని అన్నారు. దాతలు తాము సంపాందించిన దాంట్లో కొంత ఇతరులకు పంచి పెడితే వచ్చే ఆనందం మరెందులోనూ ఉండదని చెప్పారు. ప్రజలకు మాస్కులను అందించేందుకు ముందుకు వచ్చిన మేరు సంఘాన్ని దయాకర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గూడూ రు వెంకటేశ్వర్లు, సతీశ్‌కుమార్‌, సంపత్‌కుమార్‌, రవీందర్‌ రాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


logo