శనివారం 11 జూలై 2020
Mulugu - Apr 07, 2020 , 03:35:50

పారిశుధ్య పరవశం

పారిశుధ్య పరవశం

  • కార్మికులకు సీఎం కేసీఆర్‌ నజరానా
  • రూ. 5 వేలు గిఫ్ట్‌

వరంగల్‌, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి అలుపెరుగని యుద్ధం చేస్తున్న పారిశుధ్య కార్మికుల పోరాట పటిమను గుర్తించిన సీఎం కేసీఆర్‌ నజరానా ప్రకటించారు. వేతనాల్లో కోత నుంచి వారికి మినహాయింపు ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ పూర్తి వేతనాలతో పాటు రూ. 5 వేలు గిఫ్ట్‌గా ప్రకటించారు. 

పారిశుధ్య కార్మికుల్లో ఆనందం

సీఎం కేసీఆర్‌ నజరానా ప్రకటించడంతో పారిశుధ్య కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 2,586 మంది పారిశుధ్య కార్మికులుండగా, ఇందులో 2,167 మంది ఔట్‌ సోర్సింగ్‌, 201 మంది ప్రభు త్వ కార్మికులు. 133 మ ంది జవాన్లు, 86 మంది అర్బన్‌ మలేరియా సిబ్బ ంది ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ము న్సిపాలిటీల్లో వందల సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా నగరాలను శుభ్రం చేయడంతో పాటు ఫాగింగ్‌, కెమికల్స్‌ స్ప్రే చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.8500 వేతనం ఇస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా అందనుంది.


logo