ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Apr 06, 2020 , 01:20:00

సంక్షిప్త సమాచారం

సంక్షిప్త సమాచారం

 • మహబూబాబాద్‌: పట్టణంలో 36 వార్డుల్లో ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు బుక్‌ చేసుకున్న వారికి వలంటీర్ల ద్వారా ఇంటికి చేరవేస్తున్నారు.
 • ఈ నెల 14 వరకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నిత్యావస రాలు అమ్మకాలు జరపాలని డీఎస్పీ నరేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 • తొర్రూరు : సాయినగర్‌లో పేద బేడ బుడిగ జంగాల కుటుంబాలకు సార్ల కృష్ణ రూ.50వేల విలువైన బియ్యం,నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య ఎంపీపీ చిన్న అంజయ్య, రవి, కిన్నెర పాండు పాల్గొన్నారు.
 • తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో కేసిరెడ్డి రంగారెడ్డి కుమారుడు మధుకర్‌రెడ్డి సహకారంతో వెంకటాపురం సేవాట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇటుకబట్టీ కార్మికులకు బియ్యం, 15 రకాల నిత్యావసరాలు, మాస్కులు ట్రస్ట్‌ వ్యవస్థాపకు డు యాకన్న, శ్రీనివాస్‌, యాకేందర్‌, అశోక్‌, సుమన్‌, జీవన్‌రెడ్డి అందజేశారు. 
 • మహబూబాబాద్‌ టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు లక్ష్మీ శారద బుక్‌స్టాల్‌ యజమాని అంబరీష-శైలజ దంపతులు ఆహార ప్యాకెట్లను అందజేశారు. 
 • మహబూబాబాద్‌  రూరల్‌ : మండలంలోని లక్ష్మీపురం తండాలో సర్పంచ్‌ సింధు ఆధ్వర్యంలో సిబ్బంది హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 
 • ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వైద్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కంబాలపల్లి ప్రాథమిక దవాఖాన వైద్యుడు సుధీర్‌నాయక్‌ అన్నారు. ప్రజలకు జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యుల వద్దకు పంపించాలని వారికి సూచించారు.
 • కంబాలపల్లిలో గ్రామ వీవోఏల ఆధ్వర్యంలో ఎంపీ డీవో రవీందర్‌, సర్పంచ్‌ సందా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
 • నెల్లికుదురు : పోలీసు, వైద్య, పంచాయతీ, వ్యవసాయ అధికారులు, సిబ్బందికి నెల్లికుదురు మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్స్‌ ఆధ్వర్యంలో గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అత్యవసరసేవలు అందిస్తున్న 75 మందికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భోజనం అందించారు. 
 • పెద్దవంగర: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులకు జెడ్పీటీసీ జ్యోతిర్మయిసుధీర్‌ శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్య శర్మ పాల్గొన్నారు.
 • డోర్నకల్‌: మున్సిపాలిటీ పరిధిలోని దుకాణాదారులు పరిశుభ్రత పాటించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ సూచించారు. 
 • నర్సింహులపేట: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ఉమెన్‌ ఎపంవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (యూఎస్‌ఏ)కు చెందిన రాజేందర్‌రెడ్డి-ఝాన్సిరెడ్డి దంపతుల సహకారంతో మండలంలోని చెందిన 20 పేద కుటుంబాలకు 20కేజీల చొప్పున బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
 • మండలంలోని కొమ్ములవంచలో పింఛన్ల పంపిణీని ఎస్సై రియాజ్‌పాషా పరిశీ లించారు. లబ్ధిదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 
 • దంతాలపల్లి: మండలంలోని బొడ్లాడలో పింఛన్ల పంపిణీని ఎంపీడీవో గోవిం దరావు పరిశీలించారు. లబ్ధిదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 
 • చిన్నగూడూరు : మండలంలోని మేఘ్యాతండా, మంగోరిగూడెం, జయ్యారం తదితర గ్రామాల్లోని ప్రజలకు కరోనా నియంత్రణపై పీహెచ్‌సీ వైద్యుడు రవి కుమార్‌, ఎస్సై ప్రసాదరావ్‌ అవగాహన కల్పించారు. 
 • గార్ల: మండలంలో 51 మంది పేదలకు ఎంపీడీవో రవీందర్‌రావు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. పదిమంది యాచకులు, ఎనిమిది మంది అనాథలకు పది రోజుల పాటు భోజనం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
 • కురవి : మండలంలోని ఉప్పరిగూడెంలో రాంబాబు ఆధ్వర్యంలో సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌ ఇంటింటికీ వెళ్లి మాస్కులను అందజేశారు. బలపాల లింగ్యాతండాలో సర్పంచ్‌ రాంలాల్‌నాయక్‌ ప్రజలకు శానిటైజర్లను అందజేశారు. 
 • కేసముద్రం రూరల్‌ : సర్వాపురం జీపీ పరిధిలోని తండాలో మండల సేవాలాల్‌సేన ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు. 
 • జనగామ: 13వ వార్డు కౌన్సిలర్‌ మల్లిగారి కళావతిరాజు దంపతులు ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేశారు. 30వ వార్డులో కౌన్సిలర్‌ బొట్ల శ్రీనివాస్‌ కాలనీవాసులకు బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. పారిశుధ్య కార్మికులకు కౌన్సిలర్‌ కల్యాణిమల్లారెడ్డి మాస్కులు, శానిటైజర్లను ఇచ్చారు. 
 • స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : టీఆర్‌ఎస్‌ వాణిజ్యసెల్‌ విభాగం నాయకుడు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎంపీటీసీ నర్సింహులు జన్మదినం సందర్భంగా కార్మికులు, జర్నలిస్టులకు సీఐ రాజిరెడ్డి, వ్యాపారవేత్త వెంకటేశ్వర్లు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
 • స్టేషన్‌ఘన్‌ఫూర్‌, శివునిపల్లి జంట పట్టణాలకు చెందిన 15 మంది ఆశ కార్యకర్తలకు, ఏడుగురు ఆయాలకు ఆదివారం ఫ్రెండ్స్‌ మహిళా సంఘం, లయన్‌ లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. 
 • తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు కావేరి వినయ్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందికి మధ్యాహ్నం భోజనం అందించారు. సీఐ రాజిరెడ్డి, ఎస్సైలు రాజుకుమార్‌, సుదర్శన్‌రావు, జాగృతి సభ్యులు పాల్గొన్నారు. 
 • పాలకుర్తి : ఈ నెల 7 నుంచి పింఛన్లు పంపిణీ చేసేందుకు పాలకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు సర్పంచ్‌ యాకాంతరావు తెలిపారు. 
 • మహాత్మా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు గంట రవీందర్‌ ఆధ్వర్యంలో పాలకుర్తిలో ఆరు పేద కుటుంబాలకు రూ.12వేల విలువైన నిత్యావసరాలు సర్పంచ్‌ యాకాంతరావుతో కలిసి అందించారు. 
 • బచ్చన్నపేట : మండలంలోని జర్నలిస్టులకు జయశంకర్‌సార్‌ సేవా సమితి చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ నిత్యావసరాలు ఎస్సై రఘుపతి, బీజేపీ మండలాధ్యక్షుడు సోమిరెడ్డితో కలిసి అందించారు. 
 • జనగామ రూరల్‌ : శామీర్‌పేటలో ఎంపీపీ కళింగరాజు, సర్పంచ్‌ రవికుమార్‌ హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. వార్డులో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. 
 • బచ్చన్నపేట : ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఎస్సై రఘుపతి సూచించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. 
 • తరిగొప్పుల : మండలంలో గ్రామానికో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ హరిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఐకేపీ, గ్రామైక్య సంఘాల ద్వారా వరి, మక్కలు కొంటామని అన్నారు.
 • ఏటూరునాగారం: కరోనా వ్యాప్తి నివారణకు గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మాస్క్‌లు, గ్లౌజ్‌లు, కూరగాయలు ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి, సొసైటీ స్థానిక ఇన్‌చార్జి అజ్మత్‌ఖాన్‌, గుర్రపు నరేశ్‌, సర్పంచ్‌ రామ్మూర్తి పాల్గొన్నారు. 
 • ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు వార్డుల్లో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. ప్రతి వార్డుల్లో వార్డు సభ్యులు ట్రాక్టర్‌ ద్వారా పిచికారీ చేయిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 • గోవిందరావుపేట: మండలంలోని ప్రాజెక్టు నగర్‌ వద్ద నివసిస్తున్న 30 గొత్తికోయ కుటుంబాలకు రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కూరగాయలు, మాస్క్‌లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా కొత్తపల్లి ప్రసాద్‌రావు, జెడ్పీఫ్లోర్‌లీడర్‌ తుమ్మల హరిబాబు, సర్పంచ్‌ సమ్మయ్య పాల్గొన్నారు. పస్రాలో సర్పంచ్‌, ఎంపీడీవో, పోలీసుల ఆధ్వర్యంలో ఇంటింటా నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
 • మంగపేట: విత్తనోత్పత్తి పద్ధతిలో వరి సాగు చేస్తే రైతాంగానికి అదనపు లాభాలు చేకూరుతాయని వికాస్‌ అగ్రి ఫౌండేషన్‌ చైర్మన్‌ సాంబశివరెడ్డి అన్నారు. అకినేపల్లిమల్లారంలో ఆదివారం ఆయన విత్తన సేకరణ కాంటాను ప్రారంభించారు. 
 • వెంకటాపూర్‌: వెంకటాపూర్‌ మండలంలో జవహర్‌నగర్‌ గ్రామంలోని ప్రధాన రహదారిపై టోల్‌గేట్‌ నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభించారు.
 • వాజేడు: మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల చెన్నై, తిరుపతి నుంచి వచ్చారు. వారిని 14రోజుల పాటు హోం క్వారం టైన్‌లో ఉండాలని సూచించినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. 
 • ములుగు: మాతాపిత వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ములుగులో ఏర్పాటుచేసిన మెడికల్‌ గౌన్‌ల తయారీ కేంద్రాన్ని  ఆదివారం డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీనివాస్‌ ప్రారంభించారు.  కార్యక్రమంలో డీపీఎం పద్మప్రియ, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సందబాబు, కుట్టు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. 
 • కృష్ణకాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించడంతో పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ఆదివారం సామాజిక దూరాన్ని పాటిస్తూ పలువురు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు.  
 • గణపురం: మండలంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఎస్సై రాజన్‌బాబు పర్యవేక్షించారు. పోలీసులు ప్రధాన రహదారుల్లో పహారా కాశారు.  
 • కృష్ణకాలనీ : జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్య క్షుడు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు. 
 • మల్హర్‌: తాడిచెర్ల పారిశుధ్య కార్మికులను జీపీ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కోశాధికారి, కాళేశ్వరం దేవస్థానం మాజీ డైరెక్టర్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ సుంకరి సత్తన్న పాల్గొన్నారు.
 • అంబేద్కర్‌ సెంటర్‌: ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వాసుదేవరావు హెచ్చరించారు. అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద వాహనదారులకు జరిమానా విధించి వాహనాలను సీజ్‌ చేశారు. 


logo