గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Apr 06, 2020 , 01:09:10

దీపాలతో జాతి సమైక్యత..

దీపాలతో జాతి సమైక్యత..

మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి ప్రజలంతా దీపాలు వెలిగించి జాతి సమైక్యతను చాటారు. 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల వరకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు లైట్లు ఆర్పేసి, దీపాలను వెలిగించారు. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హన్మకొండలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలు దీపాలు వెలిగించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వీయనియంత్రణ పాటిస్తామని ప్రతినబూనారు.

- నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌

తాజావార్తలు


logo