శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Mar 28, 2020 , 03:06:01

సీఎం సహాయనిధికి ఎమ్మెల్యే చల్లా విరాళం

సీఎం సహాయనిధికి ఎమ్మెల్యే చల్లా విరాళం

  • రూ.3 కోట్ల సీడీఎఫ్‌ నిధులు 
  • రూ. 2.50 లక్షల నెల వేతనం అందజేయనున్నట్లు ప్రకటన

పరకాల, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి విరాళాలు పెరుగుతున్నాయి. ఆపద సమయంలో తాను కూడా అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. తన సీడీఎఫ్‌ నిధుల నుంచి రూ.3 కోట్లు, నెల వేతనం రూ.2.50 లక్షలు సీఎం సహాయ నిధికి అందించనున్నట్లు శుక్రవారం ఎమ్మె ల్యే ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హన్మకొండలోని తన నివాసంలో ధర్మారెడ్డి ఈ నిధులను సీఎం సహాయనిధికి అందించనున్న ట్లు తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వం అమలుచేసిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. గ్రామాల పొలిమేరల్లో వేసిన కంచెలను తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర పనుల నిమిత్తం కంచెలతో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు.


logo