గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Mar 28, 2020 , 03:01:29

కరోనా వైరస్‌ నిరోధానికి సోడియం హైపోక్లోరైట్‌

కరోనా వైరస్‌ నిరోధానికి సోడియం హైపోక్లోరైట్‌

  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ నిరోధానికి సోడియం హైపోక్లోరైట్‌ను స్ప్రే చేస్తున్నట్లు  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం పట్టణంలో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రేను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  అనంతరం మున్సిపల్‌ కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె తదితర సామగ్రిని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజనీకిషన్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు రాయిడి కీర్తిదుశ్యంత్‌రెడ్డి, నాగిశెట్టి పద్మ ప్రసాద్‌,  సునీత,  రజిత,  రమాదేవి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, గ్రంథాలయ డైరెక్టర్‌  రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

 కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..

చెన్నారావుపేట : ప్రజలు కరోనా వైరస్‌ పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం  చెన్నారావుపేట గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. ఆయన వెంట ఎస్సై శీలం, వైస్‌ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, సర్పంచ్‌ కుండె మల్లయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ,  నరేందర్‌,  బాలాజీ,  మహేందర్‌రెడ్డి  ఉన్నారు.

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష 

నెక్కొండ :  స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని, అప్రమత్తతోనే కరోనాకు చెక్‌ చెప్పాల్సి ఉంటుందని  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.  మండలంలోని అలంకానిపేట పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిధిలో కరోనా తీవ్రతపై వైద్యాధికారి సుమంత్‌ను ప్రశ్నించారు.  మహబూబాబాద్‌, వరంగల్‌ రూర ల్‌ జిల్లాల సరిహద్దు గ్రామమైన అలంకానిపేటలో పోలీసులు, గ్రామస్తులు కలిసి ఏ ర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించారు. సర్పంచ్‌ మాదాసు అనంతలక్ష్మి, గ్రామంలోని పెద్దలతో మాట్లాడి ఇతరులు గ్రామంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  నెక్కొండలో ఎంపీపీ రమేశ్‌, జె డ్పీకోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ నబీ,  సొసైటీ చైర్మన్‌ మారం రాము, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, వైస్‌ ఎంపీపీ రామారపు పుండరీకం , సర్పంచ్‌లు  రాజేశ్వర్‌రావు, హరికిషన్‌  తదితరులతో మా ట్లాడారు. నెక్కొండలో కూరగాయల ధరలను పరిశీలించారు.  సీఐ తిరుమల్‌, ఎస్సై నాగరాజు, సర్పంచ్‌ వీరభద్రయ్య, మండ ల నాయకులు చెన్నకేశవరెడ్డి , యాకయ్య, రాజిరెడ్డి, సోమయ్య పాల్గొన్నారు.


logo