మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Mar 07, 2020 , 02:26:07

భూపాలపల్లి రూపురేఖలు మారుద్దాం

భూపాలపల్లి రూపురేఖలు మారుద్దాం

భూపాలపల్లి టౌన్‌, మార్చి 06 : భూపాలపల్లి పట్టణ రూపురేఖలు మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలను ఆయన సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌, ఆయా శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. వెయ్యి క్వార్టర్ల నుంచి మొదలుకొని మంజూర్‌నగర్‌, మెయిన్‌ రోడ్‌, పైలెట్‌ కాలనీ, సుభాశ్‌కాలనీ, కాకతీయ కాలనీ, కృష్ణకాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పైలెట్‌ కాలనీలో ఉన్న కార్ల పార్కింగ్‌ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి పార్కింగ్‌ స్థలానికి పర్మినెంట్‌గా కేటాయించాలని సింగరేణి జీఎంను కోరారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్స్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి కలెక్టర్‌, జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిలీనియం క్వార్టర్స్‌ మధ్యలో ఉన్న తొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అలాగే కాకతీయ కాలనీ పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ సీలింగ్‌ భూమిని పరిశీలించారు. పక్కనే ఉన్న మరో పది ఎకరాల్లో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని కాలనీవాసులు కోరారు. అక్కడి నుంచి వేశాలపల్లిలో,  5 ఇైంక్లెన్‌ సమీపంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించారు. వేశాలపల్లి, పెద్దకుంటపల్లి మధ్యలో ఉన్న చెరువును అభివృద్ధి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. పెద్దకుంటపల్లిలో శ్మశాన వాటిక, మరుగుదొడ్లను నిర్మించాలని కౌన్సిలర్‌ బానోతు రజిత జుమ్ములాల్‌ కలెక్టర్‌ను కోరారు. స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌ ఓపెన్‌జిమ్‌ను ఏర్పాటు చేయాలని క్రీడాకారులు కోరారు. తిరిగి వస్తూ చెవిటి మూగ పాఠశాలలో పిల్లలతో ముచ్చటించారు. అనంతరం మంజూర్‌నగర్‌లో ఉన్న తుమ్మల చెరువును, శిఖం మ్యాప్‌ను, వెయ్యి క్వార్టర్స్‌ను పరిశీలించారు. అక్కడ పార్కును ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరగా కలెక్టర్‌ అంగీకరించారు. అక్కడ ఉన్న సూపర్‌బజార్‌ను పరిశీలించారు. 

జీఎంతో ప్రత్యేక సమావేశం

పట్టణంలోని ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో జీఎం నిరీక్షణ్‌రాజ్‌తో పాటు సింగరేణి అధికారులు, మున్సిపల్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీఎం నిరీక్షణ్‌రాజ్‌, ఎస్‌వో టూ జీఎం రఘుపతి ఏరియాలో ఉన్న బొగ్గు గనుల గురించి కలెక్టర్‌ కు మ్యాప్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. సింగరేణి అధికారులు, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు స మన్వయంతో కలిసి కట్టుగా పని చేస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సహకారంతోనే భూపాలపల్లి పట్టణం ఇంత అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం కలెక్టర్‌కు జీఎం సింగరేణి డైరీని బహుమతిగా అందించారు. 

అభివృద్ధికి నడుం బిగించండి 

పట్టణాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. పది రోజుల పాటు జరిగిన పట్టణ ప్రగతిలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఎంత డబ్బు కావాలన్న విషయమై చర్చిస్తున్నామన్నారు. ఏడు రోజుల్లో సమస్యలపై నివేదికలు తయారు చేసి 17లోగా ఇవ్వాలన్నా రు. 18, 19 తేదీల్లో మున్సిపల్‌, సింగరేణి, జెన్‌కో, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి నిధుల కేటాయింపుపై ఒక స్పష్టత తీ సుకుంటామన్నారు. 20న ఫైనల్‌ ప్రణాళిక సిద్ధం చేసి 21 నుంచి ఫీల్డ్‌లోకి వెళ్తామన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ఆర్డీవో వైవీ గణేశ్‌, పీఏసీఎస్‌ చై ర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, టీపీ వో గిరిధర్‌, జిల్లా హర్టికల్చర్‌ అధికారి అక్బర్‌, ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌, ఎస్టేట్స్‌ అధికారి శివ, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి రాంకుమార్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ షరీఫ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo