మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Mar 07, 2020 , 02:14:00

గజవాహనంపై నరసింహుడు

గజవాహనంపై నరసింహుడు

రేగొండ: భక్తుల కొంగు బంగారం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వా మి శుక్రవారం గజవాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో భా గంగా కొడవటంచలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామికి ఉదయం  గజవాహనసేవ, సాయంత్రం చంద్రవాహనంపై అలయ మాడ వీధు ల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.  కార్యక్రమంలో  అర్చకులు తూపురాణి బుచ్చమాచారి, శ్రీనివాసాచారి, శ్రీనాథచారి, రాజగోపాలాచారి, చైర్మన్‌ ఇంగే మహేందర్‌, ఈవో కే సులోచన, ధర్మకర్తలు గౌని కుమారస్వామిగౌడ్‌, మాదాటి అనిత, కరుణాకర్‌రెడ్డి, గంపల లింగయ్య, గండి తిరుపతి, మోతే రాజేశ్వర్‌రావు, నర్ర జలేందర్‌, సిబ్బంది బిల్ల శ్రీనివాస్‌, ఎక్కలదేవి మహిపాల్‌, కొంరాజు రవీందర్‌, గోరంటల శ్రావణ్‌కుమార్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


కొడవటంచకు 15 నిమిషాలకో బస్సు

భూపాలపల్లి టౌన్‌:  కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర హ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 9 నుంచి ప్రత్యేక బ స్సులు నడుపుతున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ తెలిపారు. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు 15 నిమిషాలకో బస్సును రద్దీకి అనుగుణంగా కొడవటంచకు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు భూ పాలపల్లి, చెల్పూర్‌, భాగిర్తిపేట క్రాస్‌ ద్వారా కొడవటంచకు వెళ్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 


logo