శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Mar 06, 2020 , 02:46:46

అకాల వర్షంతో అవస్థలు

అకాల వర్షంతో అవస్థలు

ఏటూరునాగారం/మంగపేట/కన్నాయిగూడెం/వాజే డు/ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ/టేకుమట్ల/మహాముత్తారం/ వెంకటాపురం (నూగూరు): మండలంలో గురువారం సా యంత్రం కురిసిన వర్షంతో మిర్చి రైతులు అతలాకుతలం అ య్యారు. ఊహించని విధంగా సాయంత్రం కురిసిన అకాల వ ర్షంతో రైతులు ఆందోళన చెందారు. సుమారు అర గంటకుపైగా భారీ వర్షం కురిసింది. రైతులు మిర్చి కోతలు పట్టారు. తోట ల్లో మిర్చి కోస్తున్న రైతులు కల్లాలపై ఆరబోశారు. మొదటి, రెండవ కోతను రై తులు ప్రారంభించారు. వర్షం పడడంతో తమకు అందుబాటులో ఉన్న టార్పాలిన్‌ షీట్లకు కప్పే ప్రయత్నం చేశా రు. కల్లాలపై ఆరబోసి ఉన్న మిర్చిపై టార్పాలిన్‌ షీట్లను కొంద రు రైతులు వేసుకోలేకపోయారు. దీంతో పలుచోట్ల మిర్చి త డిసింది. తర్వాత వర్షం తగ్గడంతో రైతులు తడిసిన మిర్చిని తిరగబోయడంతో పాటు కుప్పలు పోసుకుంటున్నారు. కల్లాలపై ఉన్న మిర్చి వర్షానికి నల్లబడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తోటల్లో ఉన్న మిరప పండ్లు వర్షానికి రాలిపోయాయి. దీంతో రాలిన మిర్చిని ఏరడంకూడా కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోయారు. రామన్నగూడెం పరిసర ప్రాంతాల్లో కల్లాలపై తడిసిన మిర్చి కుప్పలను రామన్నగూడెం ఎంపీటీసీ అల్లి సుమలత పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆమె వెంట టీఆర్‌ఎస్‌ నాయకుడు అల్లి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 


భూపాలపల్లిలో మోస్తరు వర్షం

జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయం త్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ మండలాల్లో వర్షం పడింది. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ముందు జాగ్రత్తగా కొందరు రైతులు కళ్లాల్లో పోసిన మిర్చి తడవకుండా కవర్లు కప్పారు. మరికొందరు రైతుల మిర్చిపంట తడిసింది. 


ఆందోళనలో మిర్చి రైతులు

అకాల వర్షంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరివాహక గ్రామాల్లో రైతులు వేలాది ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం రెండు దఫాలుగా కాయల కోతలు పూర్తి అయ్యాయి. కోసిన మిరప కాయలను కల్లాలు, గోదావరి తీ రాల్లో ఆరబోసుకున్నారు. కాగా వాతావరణంలో వచ్చిన మా ర్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్వల్పంగా వర్షం కురవడంతో మిర్చి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరు జల్లులు కురుస్తుండటం తో కల్ల్లాల్లోని నాణ్యమైన మిర్చి రంగుమారి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసీజన్‌లో రెండు దఫాలుగా కురిసిన వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.


ఆయా మండలాల్లో..

గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మిర్చి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థ్ధలు పడ్డారు. అరుకాలం కష్టించి పండించిన పంట చేతికి అందే సమయంలో  కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగపేట, వాజేడు, మహాముత్తారం, కన్నాయిగూడెం, టేకుమట్ల తదితర మండలాల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు అన్నదాతలు టార్పాలిన్లు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. 


logo