మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Mar 06, 2020 , 02:41:24

పక్కా స్కెచ్‌..

పక్కా స్కెచ్‌..


గోవిందరావుపేట, మార్చి05 : అప్పు ఇచ్చిన దేవేందర్‌రెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా నిందితుడు దయానంద్‌ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పథకం ప్రకారం దాడి చేశాడు. కాగా అతడు మృతి చెందాడని భావించి అనంతరం అతడికి సహాయకుడిగా వచ్చిన ఫొటో జర్నలిస్టు సునీల్‌రెడ్డిని నిందితుడు హతమర్చాడని ములుగు ఎస్పీ సాయిచైతన్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన మండలంలోని పస్రాలోని సీఐ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దారుణ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. గురువారం ఉదయం పస్రాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో దయానంద్‌ అనుమానాస్పందంగా కనిపించాడు. కాగా, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయాలను ఒప్పుకున్నాడు. పస్రాలోని బెంగళూరు బేకరీ యజమాని దయానంద్‌కు దేవేందర్‌రెడ్డి అప్పుగా రూ.6లక్షలు ఇచ్చాడు. 


ఆ ఆప్పును చెల్లించాలంటూ ఈ నెల 2న దేవేందర్‌రెడ్డితో పాటు తన మిత్రుడైన సునీల్‌రెడ్డితో వచ్చి దయానంద్‌ను అప్పు గురించి అడిగాడు. రాత్రి 8:30 గంటల సమయంలో దేవేందర్‌రెడ్డిని దయానంద్‌ తన బేకరీలోకి తీసుకెళ్లి అతడిపై అతి కిరాతకంగా దాడి చేసి చనిపోయాడనుకొని బయటకు వచ్చాడు.అదే క్రమంలో బయట ఉన్న సునీల్‌రెడ్డికి మాయమాటలు చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి అతడిని నమ్మించి దయానంద్‌ ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి అతి దారుణంగా నరికి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. హత్య జరిగిన రెండు సంఘటనల్లో దయానంద్‌ రెండు కత్తులను ఉపయోగించినట్లు నిర్ధారణ అయిందని, తీసుకున్న అప్పును చెల్లించలేక, ఆర్థిక పరిస్థితులతోనే హత్య చేసినట్లు దయానంద్‌ ఒప్పుకున్నట్లు ఏఎస్పీ వివరించారు. దయానంద్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌రెడ్డి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని న్యూరో కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా నింధితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ సాయిచైతన్య తెలిపారు. ఈ సమావేశంలో పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌, పస్రా ఎస్సై మహేందర్‌కుమార్‌ పాల్గొన్నారు. logo