మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Mar 05, 2020 , 02:46:17

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్మీయట్‌ ఫస్టీయర్‌ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారు. పరీక్ష సెంటర్ల వద్ద 144సెక్షన్‌ విధించారు. పలు సెంటర్లలో ఫ్లయింగ్‌ స్కాడ్‌ తనిఖీలు చేపట్టారు. ఇటు ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.

ఏటూరునాగారం : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గిరిజన బాలికల కళాశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గిరిజన బాలికల కళాశాల సెంటర్‌లో 124 మంది విద్యార్థులకు 117 మంది హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో 318 మంది విద్యార్థులకు 300 మంది పరీక్షలకు హాజరయ్యారు. రెండు సెంటర్లలో చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వసుంధర, అశోక్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లుగా  రఫియుద్దీన్‌, జ్యోతిర్మయి విధులు నిర్వర్తించారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్‌ సర్వర్‌పాషా, ఫ్లయింగ్‌ సాడ్‌ బృందాలు సందర్శించి తనిఖీలు చేపట్టారు.


తాడ్వాయిలో.. 

తాడ్వాయి : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 172మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 158మంది పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కిషన్‌ తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. 


గోవిందరావుపేటలో..

గోవిందరావుపేట : గోవిందరావుపేటలోని కళాశాలలో 300 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయాల్సి ఉండగా 27 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, పరీక్ష కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్‌ పాలకుర్తి భిక్షం సందర్శించినట్లు ఆయన తెలిపారు. 


మంగపేటలో.. 

మంగపేట : మంగపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్‌ పరీక్షలను ఫ్లయింగ్‌ స్కాడ్‌ సంధ్యారాణి తనిఖీ చేసి ప్రిన్సిపాల్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకటయ్యకు తగిన సూచనలు చేశారు. మొత్తం 220 మంది విద్యార్థులకు 13 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 


వాజేడులో..

వాజేడు : మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 221 మంది విద్యార్థులకు 198మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 23 మంది గైర్హాజరైనట్లు చీఫ్‌సూపరింటెండెంట్‌ అమ్మిన శ్రీనివాసరాజు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ ఆమలుతో పాటు విద్యార్థుల కోసం వైద్యశాఖ నుంచి అందుబాటులో మందులను హెల్త్‌సూపర్‌ వైజర్‌ కోటిరెడ్డి నేతృత్వంలో ఉంచడంతోపాటు తాగునీటి సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. 


logo