బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Feb 29, 2020 , 02:39:24

పౌల్ట్రీపై వైరస్‌ పిడుగు

పౌల్ట్రీపై  వైరస్‌ పిడుగు

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ:కోళ్ల పరిశ్రమను వీవీఎన్‌డీ, ఆర్డీ వైరస్‌ వణికిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల వ్యాపారులు అకస్మాత్తుగా ఈ వ్యాధి సోకి నష్టపోతున్నారు. పె ట్టుబడిని సైతం నిండా ముంచుతున్న ఈ వ్యాధి తో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. చేతికి అంది నాలుగు పైసలు మిలుగాతాయనుకు నే తరుణంలో వైరస్‌ వ్యాధి సోకడంతో వేలాది కోళ్లు మృత్యువాత పడి కోళ్ల వ్యాపారులు రూ.లక్ష ల్లో నష్టపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి ద్వారా(ఏయిర్‌ బర్న్‌ డిసీస్‌) రూపంలో కోళ్ల పరిశ్రమను ఒక్క రోజులోనే కుదే లు చేసి వ్యాపారులను కోల్కోలేని దెబ్బ తీసిందనే ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్‌, వరంగల్‌, ఉమ్మడి జిల్లాలతోపాటు ఇ తర జిల్లాలోనూ ఈ వ్యాధి ప్రబలి కోళ్ల పరిశ్రమ లు దెబ్బతింటున్నాయని  అధికారులు తెలియజేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ చర్య లు లోప బూయిష్టంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడిస్తున్నారు. వ్యాధులు సోకిన సమయంలో కోడి మాంసాన్ని 100డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉడికించి తినడం వల్ల ఎలాంటి ప్ర మాదాలు ఉండబోవని అంటున్నారు. 


వీవీఎన్‌డీ, ఆర్డీ వైరస్‌ ప్రమాదకరం..

కోళ్ల పరిశ్రమకు వెరి విల్లెంట్‌ న్యూక్యాస్టెల్‌ డిసీస్‌(వీవీఎన్‌డీ), ఆర్‌డీ వైరస్‌లు అతిప్రమాదకరమైనవని  పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌ క్షణాల్లోనే గాలి ద్వారా వ్యాప్తి చెంది నష్టాన్ని మిగుల్చుతాయని, రైతులు ముందస్తుగానే తగిన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల వైరస్‌లను అరికట్టవచ్చనని తెలిపారు. పశుసంవర్ధకశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి వారి వ్యాపారులను మెరుగు పర్చుకోవాలని సూచిస్తున్నారు. 


కాస్టెడియా ఆర్డీ వైరస్‌ నిరోధకాలు ఉపయోగించాలి..

కోళ్లకు సోకే అత్యంత ప్రమాదకరమైన వీవీఎన్‌డీ, ఆర్డీ వైరస్‌లు సోకకుండా కాస్టెడియా, ఆర్డీ వ్యాధి నిరోధక మందులను ఉపయోగించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలో పలు కోళ్ల ఫారాల్లో మరణించిన కోళ్ల శాంపిల్స్‌ను వరంగల్‌లోని రీజినల్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ కాస్టెడియా, ఆర్డీ వైరస్‌లు పాజిటివ్‌ నివేదికలు వచ్చాయని, మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల హైదారాబాద్‌లోని పరీక్ష కేంద్రానికి శాంపిల్స్‌ను పంపించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 


యాజమాన్య చర్యలకు ప్రాధాన్యత..

కోళ్ల పరిశ్రమను నిర్వహించే రైతులు వ్యాధి కా రక క్రీములు ఫారంలోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలను చేపట్టాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఫారం నడిపేందుకు అవసరమైన వ్యక్తులను మాత్రమే ఫారంలోకి అనుమతించాలని, ప్ర ధానంగా ఫారంలలో పరిశుభ్రత, జీవ సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫా రంలో పనిచేసే వారు తమ ఇంటి వద్ద నాటు కోళ్ల ను గానీ ఇతర పక్షులను గానీ పెంచరాదని, కుక్క లు, పిల్లులు, వంటి జంతులను ఫారంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. ఫారం లోపలికి అనుమతించే వ్యక్తులు, సందర్శకులు, ఉద్యోగులు, పనిచేసే వారు ఒకే ద్వారం గుండా ఫారంలోకి ప్రదేశించే విధంగా చూడాలని, సందర్శకుల రాకపోకలకు రికార్డుల ను నమోదు చేయాలని సూచిస్తున్నారు. గత 48 గంటల్లో వేరే కోళ్ల ఫారంను సందర్శించిన వారిని కోళ్ల ఫారంలోకి అనుమతించవద్దంటున్నారు. కోళ్ల ఫారంలోకి సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ను, వాహనాల డ్రైవర్లను అనుమతించరాదన్నారు. 


logo