శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Feb 29, 2020 , 02:37:19

మావోయిస్టులకు మామూళ్లు ఇవ్వొద్దు

మావోయిస్టులకు మామూళ్లు ఇవ్వొద్దు

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ: జిల్లాలోని దళారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు నిషేధిత మావోయిస్టు పార్టీ ఉత్తరాలు రాస్తూ పార్టీ ఫండ్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నదని, ఆ డబ్బులను కొందరు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ  శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ ఆ పార్టీ ఫండ్‌ కోసం డబ్బులు వసూలు చేయిస్తున్నదని, ఈ మేరకు ములుగు జిల్లా పోలీసుల నేతృత్వంలో ఇద్దరు కొరియర్లను గుర్తించి గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన దార వీరయ్య కుమారుడు సారయ్య, వరంగల్‌లోని చింతగట్టుకు చెందిన బూర బాబు కుమారుడు రంజిత్‌ అలియాస్‌ రాజును వేర్వేరు ప్రదేశాల్లో పట్టుకున్నామని, వారిని తనిఖీ చేయగా బాంబు సామగ్రి, విప్లవ సాహిత్యాలు దొరికాయని పేర్కొన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. పార్టీ పేరుతో వసూలు చేసిన డబ్బులను మావోయిస్టులు వారి బంధువులకు పంపిస్తున్నారని వెల్లడించారు. అనంతరం మావోయిస్టు పార్టీ నుంచి వారు బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతారని, తర్వాత ఆ డబ్బులు వాడుకునేందుకు అక్రమ మార్గాలను అవలంబిస్తున్నారని తెలిపారు. 


మావోయిస్టులకు బయపడకుండా డబ్బులు  ఇవ్వని వారిని, ఎదురు ప్రశ్నించిన వారిని పోలీస్‌ ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీలో కుల భావాలు పెరిగిపోయాయని, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అగ్రనేత హరిభూషన్‌, దామోదర్‌, ఆజాద్‌, శారద మధ్య వ్యతిరేకతలు, అసమానతలు ఏర్పడి ఎవరికి వారు పార్టీ సిద్ధాంతాలను కూలదోచి పార్టీ క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని ఎస్పీ వివరించారు. ప్రాజెక్టు నిర్మించే, రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి, మద్యంషాపులు, పెట్రో ల్‌ బంకులు, ఇసుక కాంట్రాక్టర్ల నుంచి పార్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెపారు. ఆ డబ్బులను సొంత, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మారుమూల ప్రాం తాల యువతను, వారి సానుభూతిపరులు, మిలిషియా, కొరియర్ల ద్వారా పార్టీ సిద్ధాంతాల పేరుతో, విప్లవ సాహిత్యాల పేరుతో ప్రభుత్వ పరిపాలనను తప్పుగా నూరి పో స్తూ పార్టీ వైపు ఆకర్షిస్తూ పార్టీ అవసరాలకు వాడుకుంటున్నారని వెల్లడించారు. 


పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన యువత ఇంట్లో పోషించే వారు లేక రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత, సీపీఐ మావోయిస్టుల ఏరివేత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు సాయుధ బలగాలతో అడవులు, మారుమూల ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారని వెల్లడించారు. అనుమానిత ప్రదేశాల్లో అనువనువూ గాలిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల దృష్ట్యా రహస్యంగా ఉత్తరాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నా రని, ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. బయటి నుంచి వచ్చే రహస్య బెదిరింపులకు బయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ సం ఘ విద్రోహ శక్తులను శిక్షించడానికి సిద్ధంగా ఉంటారని ఎస్పీ ఆ ప్రకటనలో వివరించారు. 


logo