శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 25, 2020 , 03:57:30

రామప్పకు చేరిన దేవాదుల నీరు

రామప్పకు చేరిన దేవాదుల నీరు


కాళేశ్వరం,ఫిబ్రవరి 24: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి ) పంప్‌హౌస్‌లో సోమవారం 7 మోటర్ల ద్వారా ఇంజీనీర్‌లు సరస్వతి(అన్నారం) బరాజ్‌కు 14,800 క్యూసెక్కుల నీరును తరలించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 2వ, 4వ, 5వ, 6వ,7వ, 9వ,10వ, మోటర్ల నుంచి నిరంతరంగా నీటిని  ఎత్తి పోస్తున్నారు. పైపుల ద్వారా పోసిన నీరు గ్రావిటీ కెనాల్‌ ద్వారా సరస్వతి బరాజ్‌కు తరలుతోంది.  సరస్వతి బరాజ్‌లో 09.17 టీఎంసీ నీరు ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు.


లక్ష్మీ బరాజ్‌లో 8.494 టీఎంసీల నీటి నిల్వ 

మహదేవపూర్‌:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అంబట్‌పల్లి గ్రామ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌లో క్రమం క్రమంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం లక్ష్మీ బరాజ్‌లోకి పూర్తి సామర్థ్యానికి చేరుకోగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా మోటర్లను నడిపించి సరస్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.ఈ క్రమంలో బరాజ్‌లోని నీటి రోజు రోజుకు తగ్గుతుండగా సోమవారం 8.494  టీఎంసీల నీటి నిల్వ, 97.200 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతున్నట్లు ఇంజనీర్‌ అధికారులు తెలిపారు.logo