ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 25, 2020 , 03:54:27

గూడెంలో వైద్య శిబిరం

గూడెంలో వైద్య శిబిరం

కన్నాయిగూడెం, ఫిబ్రవరి 24:   ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాల బారిన పడొద్దనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అసిస్టెంట్‌  కమాండెంట్‌ ఏసుదాసు అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ వీవీఎన్‌ ప్రసన్నకుమార్‌ ఆదేశాల మేరకు 39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో మండలంలోని బుట్టాయిగూడెంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్‌  కమాండెంట్‌ ఏసుదాసు ముఖ్య అథితిగా హాజరై మాట్లాడుతూ ఏజన్సీ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.  ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సీఆర్పీఎఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మానస, కన్నాయిగూడెం పీహెచ్‌సీ వైద్యులు అల్లి నవీన్‌ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉతంగా మందుల పంపిణీ చేశారు.  కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుభాశ్‌, కన్నాయిగూడెం ఎస్సై  సురేశ్‌, ఎంపీపీ  జనగం సమ్మక్క, బుట్టాయిగూడెం సర్పంచ్‌ కావిరి పద్మ, తదితరులు పాల్గొన్నారు.


logo