మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 21, 2020 , 03:20:34

మేడారం హుండీల నోట్ల లెక్కింపు పూర్తి

మేడారం హుండీల నోట్ల లెక్కింపు పూర్తి

మేడారం హుండీల్లోని నోట్ల లెక్కింపును గురువారం పూర్తి చేశారు. మొత్తం 10 హుండీలను లెక్కించగా రూ. 28, 84,973 ఆదాయం వచ్చిందని మేడారం ఆలయ ఈవో టీ రాజేంద్రం తెలిపారు. జాతర ప్రారంభ సమయానికి 494 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర ముగిశాక తిరుగువారం సంబరాల్లో మరో 8 హుండీలను ఏర్పాటుచేశారు.

  • రూ. 11,17,99,885 ఆదాయం
  • ఇంకా మిగిలి ఉన్న ఆభరణాలు, నాణేల లెక్కింపు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13: మేడారం హుండీల్లోని నోట్ల లెక్కింపును గురువారం పూర్తి చేశారు. మొత్తం 10 హుండీలను లెక్కించగా రూ. 28, 84,973 ఆదాయం వచ్చిందని మేడారం ఆలయ ఈవో టీ రాజేంద్రం తెలిపారు. జాతర ప్రారంభ సమయానికి 494 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర ముగిశాక తిరుగువారం సంబరాల్లో మరో 8 హుండీలను ఏర్పాటుచేశారు. దీంతో మొత్తం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల సంఖ్య 502కు చేరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల్లో కేవలం నోట్ల లెక్కింపే తొమ్మిది రోజుల పాటు సాగింది. ఇంకా కానుకల్లో నాణేలు, వెండీ, బంగారం ఆభరణాల లెక్కింపు మిగిలి ఉంది. మేడారం హుండీ లెక్కింపు గత బుధవారం ప్రారంభం కాగా, ఆరోజు 64 హుండీలను, గురువారం 65 హుండీలను, శుక్రవారం 65 హుండీలను, శనివారం 53 హుండీలను, ఆదివారం 94 హుండీలను, సోమవారం 78 హుండీలను, మంగళవారం 17 హుండీలను, బుధవారం 56 హుండీలను, గురువారం 10 హుండీలను లెక్కించారు.  ఇప్పటివరకు మొత్తం 502 హుండీలను లెక్కించగా రూ.11,17,99,885 ఆదాయం సమకూరినట్లు ఈవో వెల్లడించారు. కాగా, శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా లెక్కింపుకు బ్రేక్‌ పడింది. శనివారం నుంచి లెక్కింపు కొనసాగుతుందని ఈవో తెలిపారు. ఆదివారం వరకు మొత్తం ఆదాయ వివరాలు తేటతెల్లమవుతాయని అంచనా వేస్తున్నారు.


logo