గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 20, 2020 , 02:59:03

మంత్రి సత్యవతి ప్రగతి నిద్ర

మంత్రి సత్యవతి ప్రగతి నిద్ర
  • జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందుతో కలిసి కురవి మండలం పెద్దతండాలో బస
  • నేడు గ్రామంలో పల్లెప్రగతి కార్యాచరణ పనుల పరిశీలన
  • పల్లెలో మంత్రి సత్యవతి ప్రగతి నిద్ర

కురవి, ఫిబ్రవరి 19: పల్లెలు పట్టణాలకు ధీటుగా మెరవాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు ఏవిధంగా ఉన్నాయనే విషయం తెలుసుకోవడానికి రాష్ట్ర గిరిజన , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆమె స్వగ్రామమైన పెద్దతండాలో బుధవారం పల్లె నిద్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తండాకు చెందిన గుగులోత్‌ మంగు ఇంట్లో భోజనం చేశారు. అనంతరం స్థానికులతో కాసేపు పల్లె ప్రగతి పనుల తీరుపై మాట్లాడారు. ఆమె వెంట జెడ్పీ చైర్‌ పర్సన్‌ బిందు, సర్పంచ్‌ వనజ శ్రీరామ్‌ ఉన్నారు. కాగా, రెండు విడతల పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పల్లెల పరిస్థితి ఎలా ఉందనే అంశపై గురువారం ఉదయం తెల్లవారుజామున తండాలో మంత్రి పర్యటించి పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడనున్నారు.  


బాలిక అదృశ్యం 

ములుగురూరల్‌, ఫిబ్రవరి19: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటన ములుగు జిల్లాకేంద్ర పరిధి బండారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ములుగు పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొండబోయిన మహేందర్‌ కుమార్తె స్వాతి(17) గ్రామంలోని మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నది. మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి వస్తానని చెప్పి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. స్కూల్‌లో చుట్టు పక్క గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో వెతకగా ఎక్కడా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దీంతో స్వాతి తండ్రి మహేందర్‌ ఫిర్యాదు మేరకు ములుగు-2 ఎస్సై ఫణి కేసునమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. logo