బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Feb 15, 2020 , 02:35:27

నాణ్యమైన విద్యను అందించాలి

 నాణ్యమైన విద్యను అందించాలి

ములుగురూరల్‌, ఫిబ్రవరి14: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు పాటుపడాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా ఇన్‌చార్జి డీఈవో వాసంతి అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మాధవరావుపల్లిలోని కస్తూర్బాగాంధీ, బండారుపల్లి మోడల్‌ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కస్తూర్బా పాఠశాలకు చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురువారం పాఠశాలకు చెందిన  ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అకాడమిక్‌ పరంగా కాసేపు విద్యార్థులతో ముచ్చటించి ఫౌండేషన్‌ ప్రోగ్రాం ఏవిధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. ఈ నెల పూర్తియ్యే వరకు లోపాలను సరిచేసుకొని విద్యలో పట్టు సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు సంబంధించిన భద్రత, వారి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్‌వోను ఆదేశించారు. 


మోడల్‌ పాఠశాల తనిఖీ..

ములుగు జిల్లా కేంద్ర పరిధి బండారుపల్లి మోడల్‌ పాఠశాలను సైతం డీఈవో వాసంతి తనిఖీ చేశారు. విద్యార్థులకు రోజూవారీగా అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ గుండు రవిప్రసాద్‌తో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన విషయమై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సహ పాఠ్యాంశాలైన యోగా, ఆటలను పాఠశాలలో ఖచ్చితంగా నిర్వహించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. logo