ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 14, 2020 , 04:09:00

జల ప్రయాణం సజావుగా సాగాలె..

జల ప్రయాణం సజావుగా సాగాలె..

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 13: ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లను, రిజర్వాయర్లను, ఎత్తిపోతల పంపులను, కాల్వలను నింపుతూ చివరాఖరి ఆయకట్టు వరకు నీరు సజావుగా పరుగులు తీయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం గురువారం కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థాన సన్నిధిలోని గోదావరి ఘాట్‌కు చేరుకున్నారు. త్రివేణి సం గమం వద్ద కనుచూపు మేర జల నిధిగా మారిన ప్రాణహిత గోదావరి గంగ పవిత్ర జలాలను తల మీద చల్లుకొని నాణేలు వదిలి పూజలు చేసి జల నీరాజనాలు అర్పించారు. గోదావరి ఘాట్‌ నుంచి కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌ వద్దకు చేరుకున్నారు. నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నది జలాలను ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం బరాజ్‌ వద్దకు చేరుకున్న ఆయన గోదావరి నదిలో నాణేలు వదిలి ఉద్యమ కాలం నాటి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకున్న సీఎం ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీబరాజ్‌ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సహా అక్కడ ఉన్న ఇంజినీర్లకు, ఉన్నతాధికారులకు సూచించారు. ఇటీవల ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన రజత్‌కుమార్‌కు సంబంధిత విషయాలపై అవగాహన కలిగేలా ప్రాజెక్టు నిర్మాణం, సాగునీటి వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యతను వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్లను నింపుతూ గోదావరి జలాలు వృథా పోకుం డా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజినీర్లదేనన్నా రు. ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లను, రిజర్వాయర్లను, ఎత్తిపోతల పంపులను, కాల్వలను చివరాఖరి ఆయకట్టు దాక సాగునీరు పరుగులు తీసేలా పర్యవేక్షణ చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకొని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్‌ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలన్నారు. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్‌ వాకీటాకీల వ్యవస్థను ఏ ర్పాటు చేసుకోవాలన్నారు.ఎప్పుడు ఏ మోటార్‌ నడుస్తుంది, ఏ పంపు నడుస్తుంది, ఎన్ని నీళ్లు ఎత్తాలే, ఎప్పుడు ఆపాలే, ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వర టీం మొత్తానికి అవగాహన ఉండాలన్నారు. అలా సమన్వయంతో పని చేస్తే గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన చర్యలు చేపట్టనున్నట్లు వివరించిన సీఎం మేడిగడ్డ వద్ద మధ్యాహ్న భోజనం చేసి కరీంనగర్‌ బయల్దేరారు. ఈ పర్యటనలో మంత్రు లు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎడ్డీ  శ్రీధర్‌ దేశ్‌పాం డే, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, జెడ్పీ చైర్‌పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, చైర్మన్‌ పుట్ట మ ధు, కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయ చైర్మన్‌ బొమ్మ వెంకటేశ్వర్లు, జేసీ స్వర్ణలత, ఆర్డీవో వైవీ గణేశ్‌, మహదేవపూర్‌ ఎంపీపీ రాణీబాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  వెంకటరాణి,  సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo