శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Feb 14, 2020 , 04:07:31

పెండింగ్‌ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

పెండింగ్‌ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

ములుగు కలెక్టరేట్‌: పెండింగ్‌ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య అ న్నారు. గురువారం కలెక్టరేట్‌ ఎం పీడీవోలతో శాఖపరమైన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... శాఖపరంగా చేపట్టే పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని అన్నారు. ఆసరా పింఛన్‌ల దరఖాస్తులు, మంజూరు, పెండింగ్‌, పిండింగ్‌కు గల కారణాలను సమర్పించాలని పే ర్కొన్నారు. ఐకేపీ సిబ్బందితో వికలాంగులను గుర్తించి సద రం శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా  చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలవారీగా సిబ్బంది అవుట్‌సోర్సింగ్‌, రోజువారీ వేతనాలు, వారివివరా లు, మొబైల్‌ నంబర్లను తెలపాలని ఆదేశించారు. కా ర్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టంచేశారు. కార్యాలయ ఫైల్‌లు సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని వివరించారు. పెండింగ్‌ ఫైళ్లు ఎంతకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నదో సమర్పించాలని చెప్పా రు. గ్రామాల్లో డింపింగ్‌యార్టు, వైకుంఠదామం, నర్సరీల తాజా పరిస్థితి, ఫొటోలతో సహా సమర్పించాలని చెప్పారు. నర్సరీల్లో డిమాండ్‌ ఉన్న మొక్కలను పెంచాలని, ప్రజలు కోరిన మొక్కలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శి, జవాన్‌, సాక్షరభారత్‌ కోఆర్డినేటర్‌, అంగన్‌వాడీ వర్కర్‌, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల వివరాలు సమర్పించాలని తెలిపారు. జిల్లాలో ట్యాంకర్‌, ట్రాక్టర్‌, ట్రాలీల కొనుగోలు వివరాలు, అలాగే పల్లెప్రగతి తాజానివేదిక సమర్పించాలని ఆదేశించారు. జారీ చేసిన జాబ్‌కార్డులు, జారీ చేయాల్సిన జాబ్‌కార్డుల వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. పనుల సీజన్‌ అయినందున ఎంఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా పను లు కల్పించాలన్న ఎంపీడీవోలు వాట్సప్‌ గ్రూప్‌చేసి సమాచారాన్ని ఎప్పడికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. అం తకు ముందు కృష్ణఆదిత్య కలెక్టరేట్‌ విభాగాల్లో తని ఖీ చేపట్టి అధికారుల, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సమయపా లన పాటిస్తూ సమర్థవంతం గా విధులు నిర్వర్తించాలని, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, ఎంపీడీవోలు ఏవో శ్యాంకుమార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo