బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Feb 14, 2020 , 04:06:58

మురిసిన జల సాధకుడు

మురిసిన జల సాధకుడు

మహదేవపూర్‌, ఫిబ్రవరి13: అపర భగీరథుడు.. కాళేశ్వర జల సాధకుడు గోదావరి పరవళ్లు చూసి మురిసిపోయారు. గురువారం లక్ష్మీబరాజ్‌ను సందర్శించిన ఆయన..నిండుకుండలా కనిపిస్తున్న ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ను చూసి  మురిసిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బరాజ్‌లో పరవళ్లు తొక్కుతున్న నీటి సంద్రాన్ని చూ సి...తనకు కలిగిన అనందాన్ని అందరితో పంచుకున్నారు. లక్ష్మీ బరాజ్‌లో కొన్ని నెలలుగా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో 14 టీఎంసీల మేర నీరు నిల్వ అయింది. మరికొన్ని రోజుల్లో పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న క్రమంలో సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా సందర్శించారు.

ప్రవాహాన్ని ఒడిసి పట్టాలి..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్ని బరాజ్‌ల్లో సముద్రాన్ని తలపించేలా గోదావరి ప్రవాహాన్ని ఒడిసిపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లింక్‌-1 ఎల్లంపల్లి నుంచి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వరకు ఉన్న ప్రాజెక్ట్‌లోని అన్ని బరాజ్‌లల్లో 100 టీఎంసీల నీరు ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. ఏడాది పొడవునా సుమారు 530 టీఎంసీల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అలాగే మేడిగడ్డ నుంచి మిడ్‌ మానేరు వరకు సింకరైజేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్నారు.  

రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే.. 

లక్ష్మీ బరాజ్‌లో చేరిన నీటి ప్రవాహం వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని ఇంజినీరింగ్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ అన్నారు. లక్ష్మీ బరాజ్‌ పరివాహాక గ్రామాల్లో ఎంత వరకు పంట నష్టం జరిగిందో వివరాలను తెలుసుకోవాలంటూ ఆదేశించారు. అలాగే ముం పు వాటిల్లే ప్రాంతాలేవో.. ముందుగానే రైతులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.  


logo