శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 13, 2020 , 04:36:35

టీఆర్‌ఎస్‌ హవా!

టీఆర్‌ఎస్‌ హవా!

సహకార పోరులో గులాబీ మద్దతుదారులకు జై ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు 67 టీసీల్లో అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం వీరిలో 45 మంది గులాబీ మద్దతుదారులు ఇప్పటికే రెండు పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ కైవసం ఎన్నికలు జరిగేవి 10 పీఏసీఎస్‌ల్లోని 89 టీసీలు బరిలో 203 మంది అభ్యర్థులు.. గుర్తుల కేటాయింపు

ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సహకార ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. చివరి ఘట్టమైన ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 పీఏసీఎస్‌లలో ఇప్పటికే ఐదింటిలో టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చింది. దీంతోపాటు పాలం పేట, వాజేడు పీఏసీఎస్‌లను ఏకగ్రీవం చేసుకొంది. 156 డైరెక్టర్‌ స్థానాలకు గాను 67 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, ఇందులో 45 డైరెక్టర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకున్నారు. 89 స్థానాలకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 


ఐదు పీఏసీఎస్‌లలో తిరుగు లేని టీఆర్‌ఎస్‌.. 

జిల్లాలోని 12 పీఏసీఎస్‌లలో రెండు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు పీఏసీఎస్‌లలో టీఆర్‌ఎస్‌ అత్యధిక డైరెక్టర్‌ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని తన సత్తా చాటింది. 10 పీఏసీఎస్‌లకు సంబంధి ంచిన 89 డైరెక్టర్‌ స్థానాలకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులదే గెలుపు అనే నినాదంతో పార్టీ శ్రేణులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. పరిమిత సంఖ్యలో ఉన్న ఓటర్లను గుర్తిస్తూ వారిని వ్యక్తిగతంగా కలుస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ వంటి అంశాలనుతెలియజేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. 

 

89 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు..

ములుగు జిల్లాలో ఉన్న 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘాల్లో ఉన్న 156 డైరెక్టర్‌ స్థానాలకు గాను 67 డైరెక్టర్‌ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 45 టీఆర్‌ఎస్‌ అ భ్యర్థులు ఉండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 499 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 229 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. 89 డైరెక్టర్‌ స్థానాలకు 203మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ స్థానాల్లో జరిగే 89 స్థానాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకోవడానికి పావులు కదుపుతున్నారు. 


ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన ఇన్‌చార్జి..

జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పీఏసీఎస్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించి స్థానిక నేతలతో కలిసి పనిచేసే విధంగా దిశానిర్దేశం చేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నారు. ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. 


logo