మంగళవారం 02 జూన్ 2020
Mulugu - Feb 12, 2020 , 04:42:44

ప్రభుత్వ పథకాల అమలుకే ప్రాధాన్యత ఇవ్వాలి

 ప్రభుత్వ పథకాల అమలుకే ప్రాధాన్యత ఇవ్వాలి

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ:రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభు త్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయ్యి ఉండాలే తప్ప ఎవరికి వ్యక్తిగత ప్రాధాన్యత ఉండరాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రా వు జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లకు ఉద్బోధిం చారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించి న జిల్లా కలెక్టర్లు, అడిషన్‌ కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వి స్తృత మేధో మదనం, అనేక రకాల చర్చోపచర్చ లు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణుల తో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అలంబిభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్య వధిలో అనేక రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించామని వెల్లడించారు. 


రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు..

సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నం.1గా నిలిచిందని, రూ. 40వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని సీఎం కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం ఉండేదని, తక్కువ సమయంలోనే విద్యుత్‌ సమస్యను అధిగమించి నేడు దేశంలో అన్ని రంగాలకు 24గంటల పాటు నాణ్యమైన నిరంతరరాయ విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువడం మనందరికీ గర్వకారణమని అన్నారు. మి షన్‌ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు.  గతంలో వేస వి వచ్చిందంటే ఎక్కడ చూసినీ ప్రజలు తాగునీటి కి అవస్థలు పడే వారని, మంత్రులు కలెక్టర్ల ముం దు బిందెలతో ప్రదర్శనలు చేసే వారని గుర్తు చేశా రు. నేడు ఆ పరిస్థితి లేదని, అన్ని గ్రామాలకు సు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. భారీ సాగునీటి  ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమైన పనులన్నీ విజయవంతం గా సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మన ముందు ఉన్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లెలు, పట్టణాలు, పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లవిరియడమే అత్యంత ముఖ్యమైన పని అని సీఎం స్పష్టం చేశారు.  


గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత..

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రదత సాధించడమే లక్ష్యంగా ఇప్పటి వరకు 2విడతలుగా న్విహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం నింతరం సాగాలని, పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని, గ్రామాల్లో పరిశుభ్రత వెల్లి విరియాలని సూచించారు. మురికిగుంటలు, చె త్తాచెదారం తొలగించాలని, పాడుబడిన బావుల ను పూడ్చివేయాలని, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాత బోరు బావులన్నీ కలెక్టర్లు పూడ్చివే సేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్‌ లు, కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన విభాగా లు చిన్నవి అయ్యాయని, ఈ ప్రక్రియ పల్లెలను బాగు చేసుకునేందుకు ఎంతో సానుకూల అంశమని వెల్లడించారు. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య రాకుండా ప్రతి నెలా రూ.339కో ట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించామని, ఎంపీడీవోలు, ఎం పీవోలు, డీఎల్‌పీవోలు, డీపీవోలు, జెడ్పీసీఈవో లాంటి పోస్టులన్నింటనీ భర్తీ చేసినట్లు తెలిపారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచామని, ప్రతి గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే  అవకాశం కల్పించామన్నారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని సీఎం వెల్లడించారు. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తన అధికారాలను వదులుకొని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసిందని తె లిపారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మా త్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎవరి బా ధ్యతలు వారు నెరవేర్చే విధంగా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. 


మొక్కలు నాటడం, సంరక్షించడం..

మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత అని సీఎం కేసీఆర్‌ అన్నారు. వారి పనితీరుకు ఇది గీటు రాయి అని, మొక్కలు నాటి సంరక్షించే విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేద ని వెల్లడించారు. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ మైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నాయని, దళిత వాడలు, గిరిజన తండాలు, ఆదివాసీల గూడేల్లో ప్రజాప్రతినిధులు పర్యటించాలని, కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలని ఆదేశించారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో కేవలం 6మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉండగా వాటిని 13కు పెంచుకున్నామని, మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128కి పెంచామన్నారు.  మొత్తం 141 పట్టణ, స్థానిక సంస్థలకు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. 


logo