మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 12, 2020 , 04:39:26

ఆర్‌డీటీ సేవలు అభినందనీయం

ఆర్‌డీటీ సేవలు అభినందనీయం

చిట్యాల, ఫిబ్రవరి 11 : సామాజిక సేవలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు చేస్తున్న సేవలు అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సమాజంలో అక్కడక్కడా పేరుకుపోయిన రుగ్మతలను రూపుమాపడానికి కృషి చేస్తున్న ట్రస్ట్‌ బృందం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని నైన్‌పాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల 6, 7, 8, 9 వ తరగతి విద్యార్థులకు ఆర్డీటీ ట్రస్ట్‌ భూపాలపల్లి ఏరియా టీం లీడర్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు 40 సైకిళ్లను ఉచితంగా అందించారు. ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, ప్రతి విద్యార్థి పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. టీవీలు, సెల్‌ఫోన్లు, సినిమాలపై ఆసక్తి చూపొద్దని, పాఠ్యపుస్తకాలు చదివి మార్కులు సాధించాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు కన్న కలలు నెరవేర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సమాజానికి మూల స్తంభాలు అని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ విద్య చదివిన వారు కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్టర్లుగా ఎదిగారని గుర్తుచేశారు. విద్యార్థులు సమాజానికి, దేశానికి ఉపయోగపడాలన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నవీకరణకు రూ.16 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు నైన్‌పాక గ్రామంలో రెసిడెన్సియల్‌ పాఠశాల ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మారుమూల ప్రాం తాల్లో నివసిస్తున్న పేదలు, చెంచులకు ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నట్లు ఏరియా టీం లీడర్‌ సుబ్బరావు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో 23 గ్రామాల్లో 30 కు టుంబాలకు ఇళ్లు నిర్మించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, చిట్యాల, టేకుమట్ల జెడ్పీటీసీలు గొర్రె సాగర్‌, పులి తిరుపతిరెడ్డి, ఎంఈవో కోడెపాక రఘుపతి, సర్పంచులు తొట్ల లక్ష్మి, కామిడి రత్నాకర్‌రెడ్డి, పెండెం సాంబమార్తి, నాయకులు కర్రె అశోక్‌రెడ్డి, చింతల రమేశ్‌, జెన్నె యుగేంధర్‌, ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, నాపాక ఆలయ చైర్మన్‌ రాంరెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo