శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Feb 12, 2020 , 04:38:49

రైతుల సహకారం ప్రభుత్వానికే..

 రైతుల సహకారం ప్రభుత్వానికే..

కాటారం, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, రైతులు సీఎం కేసీఆర్‌కే ‘సహకారం’ అందిస్తారని జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేశ్‌ పేర్కొన్నారు. 15న జరిగే ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ సూచించిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాటారంలో సర్పంచ్‌ తోట రాధమ్మ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ రైతుల కలను నిజం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతు బాంధవుడయ్యారని కొనియాడారు. రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత రైతులకే దక్కుతున్నదని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని, రైతులను పట్టించుకోలేదనీ, అందుకే అప్పుడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయనీ, ఇప్పుడు రైతులకు సీఎం కేసీఆర్‌ పెద్ద కొడుకులా ఉండి పెట్టుబడి సాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. అకాల మరణం చెందితే బీమా వర్తింపజేస్తున్నారని, కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలను ఐకేపీ కేంద్రాలు ఏ ర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారని, వ్యవసాయ రం గం అభివృద్ధి చెందేలా కాళేశ్వరం ప్రాజెక్టుతో అడుగులు పడుతున్నాయన్నారు. వచ్చే సహకార సంఘం ఎన్నికల్లో రైతులంతా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సహకార సంఘం ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరేయడం కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు.  

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ నేత తోట రమా-రాంచం ద్రం దంపతులతో పాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో మంగళవారం చేరారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీ హర్షిణి రాకేశ్‌, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నేత జక్కు రాకేశ్‌, సర్పంచులు తోట రాధమ్మ, నిట్టూరి శేఖర్‌, ఎంపీటీసీ తోట జనార్దన్‌, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, యూత్‌ అధ్యక్షుడు నరివెద్ది శ్రీనివాస్‌, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య, ఉప సర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ తులిసెగారి శంకరయ్య, నాయకులు మందల లక్ష్మారెడ్డి, అయిత శకుంతల, సడువలి, సిరాజ్‌, స్వరూప, వినయ్‌, వంశీ, సంతోశ్‌, దుర్గారావు, సత్యం, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo