శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 11, 2020 , 03:39:42

‘సహకార’ బరిలో 203 మంది అభ్యర్థులు

‘సహకార’ బరిలో 203 మంది అభ్యర్థులు

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల  సంఖ్య తేలింది.  జిల్లా పరిధిలోని 9 మండలాల్లో  ఉన్న 12 పీఏసీఎస్‌లకు ఎన్నికలకు ఈ నెల 3వ తేదీన  నోటిఫికేషన్‌ జారీ కాగా 6  నుంచి 8వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు  స్వీకరించారు.  9వ తేదీన నామినేషన్ల  పరిశీలన పూర్తి చేసి అదే రోజు  అభ్యర్థుల జాబితాను నోటీస్‌ బోర్డుపై వెల్లడించారు. 10వ తేదీన అభ్యర్థుల ఉప సంహరణ గడువు సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. జిల్లాలోని 12 పీఏసీఎస్‌లకు ఒక్కొక్క పీఏసీఎస్‌కు 13 టీసీల చొప్పున 156 టీసీలకు 499 నామినేషన్లు  దాఖలయ్యాయి. సోమవారం 229 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను  ఉప సంహరించుకోగా 203 మంది అభ్యర్థులు 89 స్థానాల్లో  బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 67 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సహకార శాఖ అధికారి ప్రకటించారు. ఇందులో వెంకటాపూర్‌, వాజేడు మండలాలలోని పీఏసీఎస్‌లు పూర్తిగా ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో 89 సీటీలకు 203మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

 203మంది బరిలో.. 

జిల్లాలోని 12 పీఏసీఎస్‌లలో వాజేడు, వెంకటాపూర్‌ మండలం పాలంపేట  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల టీసీలు ఏకగ్రీవమయ్యాయి. 156 టీసీల్లో  67 టీసీలు ఏకగ్రీవమయ్యాయి.  ఇందులో  45 టీసీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాగా 89 టీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 203మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంతేకాకుండా ములుగు పీఏసీఎస్‌లో 2, ఇంచర్లలో 5, నర్సాపూర్‌ 6, వెంకటాపూర్‌ 10, లక్ష్మీదేవిపేట 6, గోవిందరావుపేట 1, తాడ్వాయి 1, ఏటూరునాగారం 10 టీసీలు  ఏకగ్రీవమయ్యాయి. మిగతా 89 స్థానాలకు 203మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలు ఈ నెల 15వ తేదీన  ఉదయం 7  నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. 

89 స్థానాలకు ఎన్నికలు..

జిల్లాలోని 12 పీఏసీఎస్‌లలో రెండు పీఏసీఎస్‌లు ఏకగ్రీవం కాగా మరో 10 పీఏసీఎస్‌లలోని 89 స్థానాలకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పీఏసీఎస్‌ ములుగు 13 టీసీలకు 2 టీసీలు ఏకగ్రీవం కాగా 11 టీసీలకు 25మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంచర్ల 13 టీసీలకు గాను 5 టీసీలు ఏకగ్రీవం కాగా 8 టీసీలకు 21మంది, పీఏసీఎస్‌ నర్సాపూర్‌ 13 టీసీలకు 6 ఏకగ్రీవం కాగా 7 టీసీలకు 16మంది, పీఏసీఎస్‌ వెంకటాపూర్‌ 10 టీసీలు ఏకగ్రీవం కాగా 3 టీసీలకు 7 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పీఏసీఎస్‌ లక్ష్మీదేవిపేట 13 టీసీలకు 6టీసీలు ఏకగ్రీవం కాగా 7 టీసీలకు 17మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పీఏసీఎస్‌ గోవిందరావుపేట 13 టీసీలలో 1 టీసీ మాత్రమే ఏకగ్రీవం కాగా 12 టీసీలకు 30మంది అభ్యర్థులు, పీఏసీఎస్‌ తాడ్వాయి 1 టీసీ ఏకగ్రీవం కాగా, 12 సీటీలకు 26మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పీఏసీఎస్‌ ఏటూరునాగారంలో 13 టీసీలకు 10 టీసీలు ఏకగ్రీవం కాగా 3 టీసీలకు 6గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. పీఏసీఎస్‌ మంగపేటలో 13 టీసీలకు గాను 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పీఏసీఎస్‌ వెంకటాపురం(నూగూరు) 13 టీసీలకు గాను 26మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

పాలంపేట, వాజేడు పీఏసీఎస్‌లు ఏకగ్రీవం.. 

జిల్లాలోని 12 పీఏసీఎస్‌లకు గాను అత్యధికంగా ఉన్న వెంకటాపూర్‌ మండలంలోని 4 పీఏసీఎస్‌లలో పాలంపేట పీఏసీఎస్‌ ఏకగ్రీవం కాగా వెంకటాపూర్‌ పీఏసీఎస్‌లో 10 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా వాజేడు పీఏసీఎస్‌ కూడా ఏకగ్రీవమైంది. ఏటూరునాగారం పీఏసీఎస్‌లో 10 టీసీలు ఏకగ్రీవం కాగా ఈ రెండు పీఏసీఎస్‌లో కేవలం 3టీసీల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. మంగపేట, వెంకటాపురం(నూగూరు), పీఏసీఎస్‌లలో 1 టీసీకి కూడా ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదు. తాడ్వాయి, గోవిందరావుపేట, మండలాలలో గల పీఏసీఎస్‌లలో ఒక్కొక్క టీసీ ఏకగ్రీవమయ్యాయి. 

అత్యధిక పీఏసీఎస్‌ల కైవసంపై దృష్టి..

జిల్లాలోని 12 పీఏసీఎస్‌లలో నామినేషన్ల ఉపసంహరణ నాటికే టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు పీఏసీఎస్‌లను కైవసం చేసుకుంది. వాజేడు, వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట పీఏసీఎస్‌లను తన ఖాతాలో వేసుకోగా ఏటూరునాగారం, వెంకటాపూర్‌ పీఏసీఎస్‌లను కూడా కైవసం చేసుకునే మెజార్టీని సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంచర్ల, నర్సాపూర్‌ పీఏసీఎస్‌లను కైవసం చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 12 పీఏసీఎస్‌ చైర్మన్లు , వైస్‌ చైర్మన్లను  కైవసం చేసుకుని మరో సారి గులాబీ జెండాను ఎగురవేసేందు కు ఎన్నికల ఇన్‌చార్జి నన్నపునేని నరేందర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కుసుమ జగదీశ్వర్‌ ప్రణాళితో ముందుకు సాగుతున్నారు.


logo