శుక్రవారం 29 మే 2020
Mulugu - Feb 11, 2020 , 03:37:50

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 10 : ‘ప్రజలు ఎంతో ఆశతో మిమ్మల్ని గెలిపించారు. ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. మీ మీ వార్డుల్లో సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలి’ అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లకు సూచించారు. సోమవారం మున్సిపల్‌ కా ర్యాలయంలో చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన నూతన పాలకవర్గం మొదటి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్రతోపాటు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా మహమ్మద్‌ అబ్దు ల్‌ అజీమ్‌ హాజరయ్యారు. ముందుగా చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి తన చాంబర్‌లో ప్రత్యేక పూజ లు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగా ఎమ్మె ల్యే, కలెక్టర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, సీనియర్‌ నాయకుడు బుర్ర రమేశ్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబులను సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దని నూతన పాలకవర్గాన్ని కోరారు. అధికారులు కౌన్సిల్‌లో ఆమోదించిన తీర్మానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. రాబోయే ఎండాకాలంలో ఆయా వార్డుల్లో తాగునీటి ఎద్దడి లేకుండా కౌన్సిలర్లు, అధికారులు చర్యలు చేపట్టాలని, ఇందుకు అనుగుణంగా వార్డుల్లోని అద్దె బో ర్లు, చేతిపంపుల మరమ్మతులను సంబంధిత అధికారులు తక్షణమే చేయించాలన్నారు. నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భం గా సమావేశంలో ప్రతి కౌన్సిలర్‌ వారి వార్డుల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్‌కు విన్నవించారు. తాగునీటి ఎద్దడి ఉన్న వార్డుల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసి ఈ నెల 20లోపు నీటిని అందించాలని మున్సిపల్‌ ఇంజినీర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో మొత్తం తొమ్మిది ఎజెండా అంశాలను ప్రస్తావించగా ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమావేశానికి గైర్హాజరైన ఆయా శాఖల అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సమావేశానికి రాకపోవడాన్ని తప్పుబట్టారు. ఇంకోసారి ఇలా జ రిగితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, డీఈ రవీంద్రనాథ్‌, టీపీవో గిరిధర్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ న రేశ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రవీందర్‌రావు, సింగరే ణి ఎస్‌వోటు జీఎం రఘుపతి, అర్బన్‌ పీహెచ్‌సీ వైద్యురాలు జ్యోతి, మహిళా ఆర్గనైజర్‌ భారతీరెడ్డి, అటవీశాఖ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌, మెప్మా డీ ఎంసీ రాజేశ్వరి, కో ఆర్డినేటర్‌ నిర్మల, కార్యదర్శి స్వప్న, 29 వార్డుల కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo