బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Feb 10, 2020 , 03:28:17

రేపటి నుంచి హుండీల లెక్కింపు

రేపటి నుంచి హుండీల లెక్కింపు
  • హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలింపు
  • మేడారం జాతర ఈవో రాజేంద్రం వెల్లడి

తాడ్వాయి, ఫిబ్రవరి09: మేడారం సమ్మక్క-సారక్కల మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై భక్తులు కానుకలు వేసేందుకు ఏర్పాటు చేసిన  హుండీలను ఆదివారం దేవాదాయశాఖ అధికారులు తరలించారు. భక్తులు వేసిన కానుకలతో గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలు నిండుకోవడంతోపాటు మహాజాతర ముగియడంతో లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 450 హుండీలు భక్తుల కానుకలతో నిండుకోవడంతో బస్‌ క్యారియర్లలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మేడారం జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులు తరలింపును చేపట్టారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలిస్తున్నారు. మంగళవారం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో రాజేంద్రం తెలిపారు. 


logo