ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 10, 2020 , 00:52:38

నేడు బాన్సువాడలో ‘ప్రజావాణి’

నేడు బాన్సువాడలో ‘ప్రజావాణి’

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన శరత్‌కుమార్‌ ప్రజావాణిలో మార్పు తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, కామారెడ్డిల్లో సైతం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి నెలా రెండో సోమవారం బాన్సువాడలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రతి మూడో సోమవారం ఉదయం 10.30 నుంచి 1.30 నిర్వహించనున్నారు. బిచ్కుందలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ప్రతి నెలా మొదటి శనివారం 10.30 నుంచి 1.30 వరకు ప్రజావాణి కొనసాగనుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ప్రజావాణి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

logo