ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 10, 2020 , 00:52:38

భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి

భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ :  అటవీ, రెవెన్యూ భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు. జనహిత భవన్‌లో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. వివాదాస్పద భూములు ఉంటే డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులకు నివేదిక అందజేయాలని సూచించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ హక్కుల పత్రం అర్జీలను కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ భూముల వివాదాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ దోత్రె, డీఎఫ్‌వో వసంత, ఆర్డీవోలు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు  పాల్గొన్నారు. 


logo