గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 10, 2020 , 00:52:04

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు శుభాకాంక్షల వెల్లువ

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు శుభాకాంక్షల వెల్లువ

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లి గంప గోవర్ధన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దోమకొండ : దోమకొండ మండలం నుంచి పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌ తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ నర్సారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య, ఎంపీటీసీ సభ్యుడు రమేశ్‌, నాయకులు శంకర్‌, శేఖర్‌, నర్సింహులు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

మాచారెడ్డి : ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన గంప గోవర్ధన్‌కు మండల టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ తరలిన వారిలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, జడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హంజి నాయక్‌, వైస్‌ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బూక్య నర్సింహులు, పగడాల బాలచంద్రం, శ్రీనివాసాచారి, ఫూల్‌చంద్‌, కంది ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

బీబీపేట్‌: రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను హైదరాబాద్‌లో కలిసి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, బాశెట్టి నాగేశ్వర్‌, నాగరాజ్‌గౌడ్‌, సిద్దరాములు  పాల్గొన్నారు.


logo