మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 09, 2020 , 02:37:59

న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు భూ నిర్వాసితుల వినతి

న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు భూ నిర్వాసితుల వినతి

గణపురం, ఫిబ్రవరి 8 : ఓపెన్‌ కాస్టు -3 భూ నిర్వాసితులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని అసలైన పట్టాదారులకే అందించాలని కోరుతూ మండలంలోని మాధవరావుపలి ్లభూ నిర్వాసితులు శనివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు మాధవరావుపల్లి శివారులో 318 సర్వే నంబర్‌లో 7 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 50 సంవత్సరాల నుంచి వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నామని, కొత్తగా సింగరేణి సంస్థ ఏ ర్పాటు చేస్తున్న కేటీకే ఓసీ-3 ప్రాజెక్ట్‌లో ఆ భూమి పోతుందన్నదన్నారు. కాగా, ఆ భూమిపై కొందరు కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమను బెదిరించి సింగరేణి సర్వేలో వారికి చెందిన కొందరి పేర్లను నమోదు చేశారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సింగరేణి ఇచ్చే పరిహారాన్ని తమకు ఇప్పించాలని బాధితులు కోరారు. కార్యక్రమంలో మాచర్ల చిన కనకయ్య, దొంతర మ ల్లయ్య, కీర్తి వీరయ్య, కుక్కల యకొంరయ్య, కీర్తి మొగిళి, దొం తర గట్టయ్య, పోశయ్య, రాచకొండ సమ్మయ్య పాల్గొన్నారు.logo