మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Feb 08, 2020 , 03:31:39

పోటెత్తిన భక్తజనం

పోటెత్తిన భక్తజనం

మేడారం బృందం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 07: సమ్మక్క -.సారలమ్మ తల్లుల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.  ఇద్దరు తల్లులు గద్దెలపై కోలువుదీరడంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. శుక్రవారం తల్లులకు ఇష్టమైన రోజు కావడం జాతరలో మొక్కులు చెల్లించే రోజు కావడంతో దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. జాతరలో మూడు రోజుల నిద్ర అనంతరం మొక్కులు చెల్లించుకుంటేనే ముక్తి లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు పోటెత్తారు. వన దేవతలను ఒకే రోజు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల జాతరలో  మొక్కులు చెల్లించే రోజు  తల్లుల దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు గవర్నర్లు తమిళసై, బండారు దత్తాత్రేయ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు  దర్శించుకున్నారు. సాయంత్రం భక్తులకు దర్శనం కోసం నాలుగు గేట్లు తెరువడంతో పెద్ద ఎత్తున భక్తులు గద్దెల వద్దకు పరుగులు తీశారు. దీంతో శుక్రవారం తల్లుల దర్శనం కోసం భక్తులు పోటేత్తారు.logo