శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Feb 08, 2020 , 03:28:56

తల్లులను దర్శించుకున్న ప్రముఖులు

తల్లులను దర్శించుకున్న ప్రముఖులు

మేడారం బృందం : సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా శుక్రవారం తల్లులను పలువురు ప్రముఖులు దర్శించుకుని ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బండా ప్రకాశ్‌,           ప్రభుత్వ చీఫ్‌విప్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌, ప్రభుత్వ విప్‌లు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, గండ్ర వెంకటరమణరెడ్డి, బానోత్‌ శంకర్‌నాయక్‌, నన్నపనేని నరేందర్‌, తాటికొండ రాజయ్య, రెడ్యానాయక్‌, కొరగంటి చందర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నేతి విద్యాసాగర్‌, జెడ్పీచైర్మన్లు కుసుమ జగదీశ్వర్‌, గండ్ర జ్యోతి, మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, అజ్మీరా చందులాల్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు కన్నెబోయిన రాజయ్యయాదవ్‌, గుండు సుధారాణి, వాసుదేవారెడ్డి, గాంధీనాయక్‌, వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ములుగు జెడ్పీ వైస్‌చైర్‌ పర్సన్‌ బడె నాగజ్యోతి, తాడ్వాయి ఎంపీపీ గొంది వాణిశ్రీ, మేడారం పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, పునరుద్ధ్దరణ కమిటీ  సభ్యులు  ఉన్నారు. 

Previous Article జన జాతర
Next Article జన జాతర!

logo