ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 08, 2020 , 03:26:56

వైభవంగా సమ్మక్క, పగిడిద్దరాజు పెళ్లి

వైభవంగా సమ్మక్క, పగిడిద్దరాజు పెళ్లి

బయ్యారం, ఫిబ్రవరి 07 : నంది మేడారంగా పిలుచుకునే నామాలపాడు సమ్మక్క,సారలమ్క ఆలయంలో వనదేవతల జాతర  మూడు రోజులు వైభవం గా కొనసాగింది. తల్లీకూతుళ్లను గద్దెలపై  ప్రతిష్ఠించడం తో  వారిని దర్శించికుని మొక్కలు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చె తల్లులుగా నందిమేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు పేరుండడంతో పలు జిల్లాల నుంచి సుమారు 80 వేలమంది భక్తులు వచ్చారు. సీఐ రమేశ్‌, ఎస్సై రమాదేవి బందోబస్తును పర్యవేక్షించారు.

కనుల పండువగా సమ్మక్క , పగిడిద్దరాజు కల్యాణం

నంది మేడారం ఆలయంలో  గురువారం అర్ధరాత్రి సమ్మక్క, పగిడిద్ద రాజు కల్యాణం అంగరంగ వైభవంగా ఆలయ పూజారి తుర్సం సాంబలక్ష్మి జరిపించారు. ఈ తంతును పరిశీలించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పెళ్లి తంతు నిర్వహించడం నంది మేడారంలో ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. 


logo