మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 08, 2020 , 03:20:00

మీడియా సెంటర్‌ సందర్శనలో కలెక్టర్‌

మీడియా సెంటర్‌ సందర్శనలో కలెక్టర్‌

మేడారం బృందం, నమస్తేతెలంగాణ : మేడారం మహాజాతర సజావుగా ప్రశాంత వాతావరణంలో నడిపించి, జా తర విజయవంతానికి మీడియా కీలక పాత్ర పోషించిందని ములుగు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. జా తర సందర్భంగా శుక్రవారం కల్యాణ మండపంలో ఏర్పా టు చేసిన మీడియా కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. మీ డియా ప్రతినిధుల కోసం ఇంటర్నెట్‌తో పాటు భోజన, వ సతి సౌకర్యాలు కల్పించి వార్తలను తొందరగా పంపించేందుకు ఎక్కువ సామర్థ్యం గల ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించిన అధికారులను అభినందించారు. జాతర దృశ్యాలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ తెలుపడం వల్ల, జాతరపై ఎంతో ప్రచారం నిర్వహించ డంతో జాతీయ, అంతర్జాతీయంగా అధిక గుర్తింపు వచ్చిందన్నా రు. భక్తకోటి జనానికి జాతరలో చేసిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ తెలియజేసి విశేష ప్రచారం కల్పించడం తో ప్రభుత్వం ఆశించిన దానికంటే భక్తులు అధిక సంఖ్యలో జాతరకు వస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. విస్తృత ప్రచారం కల్పించిన మీడియా పాత్ర మరువలేనిదన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట జాతర వోఎస్‌డీ కృష్ణ ఆదిత్య, స మాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డీఎస్‌ జగన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ముర్తుజా, డీపీఆర్వోలు రవికుమార్‌, బండి పల్లవి, ఆయుబ్‌ అలీ, ఎంఏ గౌస్‌, కిరణ్మయి, తదితరులున్నారు.

కంట్రోల్‌ రూంను సందర్శించిన కలెక్టర్‌..

మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో సీసీ కెమెరాల పనితీరును      వోఎస్‌డీ కృష్ణ ఆదిత్యతో కలిసి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రాకపోకలను క్యూలైన్లలో గద్దెల వద్ద భక్తుల రద్దీని పరిశీలిస్తూ అధికారులకు ప లు సూచనలు సలహాలను అందించారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మేడారం జాతరలో ఏఎస్‌ఆర్‌ సేవా ఫౌం డేషన్‌ ద్వారా ప్లాస్టిక్‌ రహిత జాతరకు కృషి చేసినందుకు బృందం సభ్యులను కలెక్టర్‌ అభినందించారు.


logo