గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 07, 2020 , 03:25:29

సమ్మక్క తల్లి కోసం భక్తుల పరుగు

సమ్మక్క తల్లి కోసం భక్తుల పరుగు

మేడారం బృందం : ఆదివాసీ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసినట్లు చరిత్ర చెబుతున్న నేపథ్యంలో విభిన్న వర్గాల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించే మేడారం జాతర ఒక అద్భుత ప్రపంచం. వనమంతా జనారణ్యంగా మారి ఎటు చూసినా వన దేవతల నామస్మరణ వినిపిస్తుంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, విదేదేశాల నుంచి సైతం జాతర సమయానికి భక్తులు మేడారం చేరుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మొదట గద్దెలను చేరుకునేది సారలమ్మ అయితే, మరునాడు  సమ్మక్క తల్లి చేరుకుంటుంది. తల్లి వస్తుందన్న సంకేతం తుపాకుల మోతతో తేట తెల్లమవుతుంది. దీంతో అప్పటి వరకు తల్లి రాక కోసం, ఆమెను దర్శించుకునేందుకు ఎదురుచూసే భక్తులు సమ్మక్క తల్లీ అంటూ మేడారంలోని అన్నిదారుల నుంచి చిలుకల గుట్టవైపు పరుగులు తీశారు. సమ్మక్క నామస్మరణ తన్మయత్వాన్ని మదిలో నింపుకొని భక్తులు ఉరుకులు, పరుగులు తీస్తుండగా.. శివసత్తులు మాత్రం పూనకాలతో ఊగిపోతు రాళ్లు, రప్పలు, గుంతలు, బురద ఇవేమి లెక్కచేయకుండా నిమిషాల్లో వడివడిగా సమ్మక్క తల్లికి ఎదురుగా పరుగులు పెట్టే దృశ్యం ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ క్రమంలో భక్తులను కట్టిడి చేసేందుకు పోలీసులు పడ్డ శ్రమ ఇంతా అంతా కాదు. 


logo