బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Feb 06, 2020 , 03:40:27

తల్లుల సేవలో

తల్లుల సేవలో

మేడారం బృందం, నమస్తే తెలంగాణ : స్వచ్ఛ మే డారం.. స్వచ్ఛ జాతర నిర్వహణకు జిల్లా పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేపట్టింది. మేడారం మహాజాతరకు వ స్తున్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా 24 గంటలూ పారిశుధ్య కార్మికులతో జాతరలోని చెత్తాచెదారాన్ని తొ లగించేలా చర్యలు తీసుకుంటున్నారు. 3,450 మంది పారిశుధ్య కార్మికులతో జాతరలోని ఏ ప్రాంతంలోనూ అపరిశుభ్రతకు అవకాశం లేకుండా చూస్తున్నారు. 


30 స్వచ్ఛ ఆటోలు..

మేడారం జాతరకు వచ్చే భక్తులు అనారోగ్యానికి గురికాకుండా జాతర పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తరలించేందుకు 30 స్వచ్ఛ ఆటోలను గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కా ర్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జాతర పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు సూ చిస్తూనే చెత్తను సేకరిస్తున్నారు. 


logo