ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 06, 2020 , 03:37:30

తల్లుల దీవెనే రక్షణగా..!

తల్లుల దీవెనే రక్షణగా..!

వెంకటాపూర్‌ : మేడారం పరిసర ప్రాంతాల్లో తల్లుల మహిమ స్పష్టంగా కనిపిస్తుంది. తల్లులను నమ్ముకొని వచ్చిన భక్తులు కారడవిలో గుడారాలు వేసుకొని వారం రోజుల పాటు ఉంటారు. అయితే, భక్తులకు విష పురుగులు, ఇతర వన్యప్రాణుల నుంచి హాని కలగడం ఇక్కడ చాలా అరుదు. భక్తులంతా తల్లుల తన్మయత్వంలో ఉండడం వల్లే వారం రోజుల పాటు గుడారంలో ఉన్నా ఎలాంటి అనారోగ్యం కలగదని భక్తులు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న రోగాలు కూడా మాయమై పోతాయని విశ్వసిస్తున్నారు. ఇక ప్రతి చెట్టూపుట్టలో కూడా వారికి తల్లులే దర్శనమిస్తారు. మొక్కు సమర్పించుకున్న వెంటనే చెట్టుకు, పుట్టకు, రాళ్లకు పసుపు, కుంకుమతో అలంకరించి, నైవేద్యం సమర్పిస్తారు. దీంతో అడవిలో ఉన్న ప్రతి పుట్ట, చెట్టు ఓ పవిత్రమైన స్థలంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవు.  ఈ అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి దైవంతో సమానం. మొక్కుబడిగా బంగారం సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఎలాంటి రక్షణలేని ప్రదేశంలో తల్లుల దీవెనే రక్షణగా భక్తులు భావిస్తున్నారు. 


logo