సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:58:47

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 04 : జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద వారికీ అందేలా చూడాలని అన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు చొరవ చూ పాలని సూచించారు. జిల్లాలో కొన సాగుతున్న పనులను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ , వైద్య, విద్యా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను వివిధశాఖల వారీగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి అక్రమ ఇసుక రవా ణా జరుగకుండా చూస్తానని, జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా చేయడానికి కృషి చేస్తానని అన్నా రు. నీతిఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లాకు మళ్లీ మొ దటి స్థానం వచ్చేలా చూస్తానని అన్నారు. ఈ కా ర్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో మహేశ్‌బాబు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo