బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:57:00

రా రమ్మని.. రామప్ప పిలిచెనుగా..!

రా రమ్మని.. రామప్ప పిలిచెనుగా..!

వెంకటాపూర్‌, ఫిబ్రవరి 04 : తల్లులను దర్శించుకుని తిరుగు పయనంలో సేద తీరేందుకు అనువుగా ఉన్న పర్యటక ప్రాంతమైన  రామప్ప దేవాలయానికి భక్తులు రావడం అనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసు, వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, దేవాదాయ, పురావస్తుశాఖలతో పాటు పలు శాఖల అధికారులు భక్తుల కోసం సర్వం సిద్ధ చేశారు. భూపాలపల్లి, కాటారం, బెల్లంపల్లి, గోదావరిఖని, కరీంనగర్‌, కాళేశ్వరం నుంచి వచ్చిన భక్తులు రామప్పను సందర్శించారు. బుధవారం మేడారంలో సారక్క, గురువారం సమక్క గద్దెలకుకొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా హాజరుకానున్నారు. 


500 మంది పోలీసుల బందోబస్తు..

రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న భక్తుల రక్షణకు సూమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై నరహరి తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సరస్సుతో పాటు పలు ప్రాంతాల వద్దకు వెళ్లకూడదని ఆయన సూచించారు.

 

భక్తులకు వైద్య సేవలు..

భక్తుల కోసం రామప్ప ఆలయం ప్రాంగణంలోని గార్డెన్‌లో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు  వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం 300 మందికి వైద్య సేవలు అందించినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా  వెంకటాపూర్‌ రెవెన్యూ సిబ్బందితో పాటు మండల పరిషత్‌ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.  


logo