గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:56:19

సమ్మక్క సేవలో 385 మంది విద్యుత్‌ సిబ్బంది

సమ్మక్క సేవలో 385 మంది విద్యుత్‌ సిబ్బంది

- ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌ రావు

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : ప్రతిష్టాత్మకమైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో మెరుగైన విద్యుత్‌ను అందించేందుకు 385 మంది విద్యుత్‌ ఉద్యోగులను నియమించడం జరిగిందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌ రావు అన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం జాతరలో విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సిబ్బంది 24 గంటల పాటు నిరంతరంగ పని చేస్తారని తెలిపారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇద్దరు చొప్పున విధుల్లో ఉంటారన్నారు.  ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద డేటా మోడెంలను బిగించడం జరిగిందని వీటి ద్వారా లోడ్‌ తీరు తెన్నులను తెలుసుకుని లోపాలను సరిదిద్దునునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఓల్టేజి రీడింగ్‌లను నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు.  సీఎండీ వెంట కంపెని డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, సీజీఎంలు మోహన్‌ రావు, కిషన్‌, ఎస్‌ఈలు నరేష్‌, నాగ ప్రసాద్‌, డీఈ భాస్కర్‌, అనిల్‌ కుమార్‌, మహేందర్‌  ఉన్నారు.


logo