మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Feb 04, 2020 , 03:40:32

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లోకి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లోకి..

మల్హర్‌, ఫిబ్రవరి 3 : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, టీఆర్‌ఎస్‌ నాయకుడు జక్కు రాకేశ్‌ అన్నారు. మండలంలో కాంగ్రెస్‌కు చెందిన కొయ్యూరు సర్పంచ్‌ సిద్ధ లింగమూర్తితోపాటు ఐదుగురు వార్డు సభ్యులు, తాడిచెర్ల-1 ఎంపీటీసీ రావుల కల్పన మొగిళి, కో ఆప్షన్‌ అయూబ్‌ఖాన్‌తోపాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంథని మండలకేంద్రంలోని పుట్ట మధు నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టడం వల్లే పొరబాటున కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని, ఇప్పుడు వాస్తవాలను గ్రహించి తమ తప్పు తెలుసుకొని టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న నాయకులు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలనే తనకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు శీలం లక్ష్మయ్య, గొనె శ్రీనివాస్‌, నాయకులు తాజొద్దీన్‌, కోట రవి, రాఘవరెడ్డి, యదగిరిరావు, జాగిరి హరీశ్‌, లింగరావు, మల్లేశ్‌, సురేశ్‌, గుంటి రమేశ్‌, నారాయణ, వెంకటేశ్‌, సుంకు రాము, బాపురెడ్డి పాల్గొన్నారు.


logo