గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 04, 2020 , 03:37:38

కాజీపేట రైల్వే సమస్యలను పరిష్కరించాలి

కాజీపేట రైల్వే సమస్యలను పరిష్కరించాలి

సిద్ధార్థనగర్‌, ఫిబ్రవరి03: కాజీపేట రైల్వే డివిజన్‌, రైల్వే వ్యాగన్‌కోచ్‌, తదితర రైల్వే సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, లోక్‌సభ సభ్యు డు పసునూరి దయాకర్‌తో పాటు ప్రభు త్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ వినతిపత్రాన్ని అందజేశారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌స్థాయికి అప్‌గ్రేడ్‌ చే యాలని, స్టేషన్‌లో కొన్ని రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని కోరారు. అనంతరం డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలజీ అధికారులను కలిసి జిల్లాలోని  రైల్వే స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. 


logo